RANA DAGGUPATI GLIMPSE RELEASED FROM POWER STAR PAWAN KALYAN BHEEMLA NAYAK FILM NR
Bheemla Nayak - Rana Daggubati: భీమ్లా నాయక్ నుంచి అప్డేట్ వచ్చేసిందోచ్.. ధర్మేంద్ర అంటూ నిత్యామీనన్‌కు వార్నింగ్?
Bheemla Nayak Rana daggubati
Bheemla Nayak - Rana Daggubati: డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా భీమ్లా నాయక్. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తున్నాడు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కనున్న ఈ సినిమా భారీ అంచనాలతో రూపొందుతుంది. ఇదిలా ఉంటే తాజాగా భీమ్లా నాయక్ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది.
Bheemla Nayak - Rana Daggubati: డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా భీమ్లా నాయక్. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తున్నాడు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కనున్న ఈ సినిమా భారీ అంచనాలతో రూపొందుతుంది. ఇదిలా ఉంటే తాజాగా భీమ్లా నాయక్ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది.
ఇందులో మరో స్టార్ హీరో రానా కూడా నటిస్తున్నాడు. ఇక రానా పవన్ కు ఎదురుగా సవాల్ విసిరే పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రానా పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల అయింది. రానా మాస్ లుక్ లో ఎంట్రీ ఇచ్చి.. నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా.. స్టేషన్ లో టాక్ నడుస్తుంది.. నేనెవరో తెలుసా.. ధర్మేంద్ర.. హీరో అని నిత్యామీనన్ కు వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి రానా ఇందులో డేనియల్ శేఖర్ పాత్రలో ప్రేక్షకులను ఫిదా చేశాడు.
ఇటీవలే ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ కూడా విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా సినిమా విడుదలకు ముందే ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మలయాళంలో అయ్యప్పన్ కోషియమ్ గా విడుదల కాగా.. మలయాళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో తెలుగు రీమేక్ లో కూడా ఈ సినిమాతో మరింత హిట్ కొట్టాలని చూస్తున్నాడు పవన్. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ లు విడుదలై బాగా ఆకట్టుకుంది.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. త్రివిక్రమ్ మాటలను అందిస్తున్నాడు. ఇందులో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం రానా దగ్గుబాటి పాత్రకు సంబంధించిన టీజర్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఇక క్షణంలోనే ఈ వీడియోను ఎంతో మంది వీక్షించారు. అంతేకాకుండా ఇందులో రానా లుక్ లో ఓ రేంజ్ లో ఫైర్ కనిపిస్తుంది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇక పవన్ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సినీ బృందం సిద్ధంగా ఉంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.