తాళి కట్టు శుభవేళ తండ్రి సురేష్ బాబు, బాబాయి వెంకటేష్‌లతో రానా..

తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ్ మాల అన్నట్టు మరికొన్ని గంట్లో రానా దగ్గుబాటి, తన స్నేహితురాలు మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేయబోతున్నాడు.

news18-telugu
Updated: August 8, 2020, 11:14 AM IST
తాళి కట్టు శుభవేళ తండ్రి సురేష్ బాబు, బాబాయి వెంకటేష్‌లతో రానా..
తండ్రి, బాబాయిలతో రానా దగ్గుబాటి (Twitter/Photo)
  • Share this:
తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ్ మాల అన్నట్టు మరికొన్ని గంట్లో రానా దగ్గుబాటి, తన స్నేహితురాలు మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే రానా, మిహీకా మెహందీకి సంబంధించిన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకకు కేవలం 50 మంది లోపు అతిథులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి, బాబాయి వెంకటేష్, తండ్రి సురేష్‌ బాబుతో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఇప్పటికే పెళ్లికి హాజరయ్యేవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని దగ్గుబాటి ఫ్యామిలీ కోరింది. ఈ పెళ్లి వేడుకకు రామానాయుడు సినీ విలేజ్ స్టూడియోలో బయో సెక్యూర్ వాతావరణంలో పెళ్లి తంతును నిర్వహించనున్నారు.

ఇప్పటికే రానా, మిహీకాలకు సంబంధించిన మెహందీ, హల్దీ కార్యక్రమాలకు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లికి  ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు నాగ చైతన్య, సమంత, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,దిల్ రాజు,సుబ్బిరామిరెడ్డి, రాజమౌళి వంటి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందినట్టు సమాచారం. అయితే రాజమౌళికి కరోనా సోకడంతో ఆయన వచ్చే అవకాశాలు లేవు. మొత్తంగా రానా, మిహీకాల పెళ్లి చేసుకోబోతున్న సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారికి శుభాకాంక్షల తెలుపుతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 8, 2020, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading