• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RANA DAGGUBATI VISHNU VISHAL PAN INDIAN MOVIE ARANYA OFFICIAL TRAILER RELEASED AND GETS POSITIVE TALK PK

Rana Daggubati Aranya trailer: రానా ‘అరణ్య’ ట్రైలర్.. ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం..

Rana Daggubati Aranya trailer: రానా ‘అరణ్య’ ట్రైలర్.. ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం..

రానా అరణ్య ట్రైలర్ (Rana Aranya trailer)

Rana Daggubati Aranya trailer: బాహుబలి సినిమాతో హీరోగా ప్రభాస్ క్రేజ్‌తో పాటు విలన్ భళ్లాలదేవుడిగా నటించిన రానాకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రానా తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.

  • Share this:
బాహుబలి సినిమాతో హీరోగా ప్రభాస్ క్రేజ్‌తో పాటు విలన్ భళ్లాలదేవుడిగా నటించిన రానాకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రానా తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. తాజాగా రానా.. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘అరణ్య’ అనే త్రిభాషా చిత్రం చేస్తున్నాడు. హిందీలో ‘హాథీ మేరా సాథీ’ పేరుతో విడుదల కానుంది. తమిళంలో ‘కాదన్’ పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన తెలుగు, హిందీ, తమిళ టీజర్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ విడుదలైంది. 3 నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రానా  అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగ వ్యక్తిగా నటిస్తున్నాడు. ఇందులో అడివి మనిషిగా ‘అరణ్య’గా  రానా లుక్ అదిరిపోయింది.  మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది. ఈ సినిమాలో జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్ , విష్ణు విశాల్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో మార్చ్ 26న విడుదల చేయనున్నారు.

అరణ్య సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. భారీ బడ్జెట్‌తో అరణ్య సినిమాను నిర్మించారు. దాదాపు 40 కోట్లకు పైగా బడ్జెట్ ఈ సినిమా కోసం ఖర్చు చేసారు. ప్రభు సాల్మాన్ గతంలోనూ ఇలాంటి అడవి నేపథ్యంలో సినిమా చేసాడు. విక్రమ్ ప్రభు హీరోగా కుమ్కీ అనే సినిమా చేసాడు. అది సూపర్ హిట్ అయింది. మరోసారి అడవి నేపథ్యంలోనే ఏనుగులను లక్ష్యంగా చేసుకుని అరణ్య సినిమా తెరకెక్కిస్తున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు