Rana Daggubati : రానా దగ్గుబాటి కొత్త అవతారం.. ఆ సినిమా కోసం తప్పట్లేదు..

రానా దగ్గుబాటి (File/Photo)

Rana Daggubati : దగ్గుబాటి రానా సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరక్క్కించిన తాజా చితం “విరాటపర్వం”. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. కాగా ఈ సినిమాలో రానా ఓ ఇంట్రెస్టింగ్ పాటను పాడబోతున్నాడని తెలుస్తుంది.

 • Share this:
  రానా దగ్గుబాటి సింగర్‌గా మారబోతున్నారు. ఆయన వేణు ఊడుగుల విరాటపర్వం (Virata Parvam)లో ఆయన ఓ పాట పాడబోతున్నారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... రానా (Rana Daggubati ), సాయిపల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో రానా ఓ ఇంట్రెస్టింగ్ పాటను పాడబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు వచ్చే వారం పాట రికార్డ్ చేయబడుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్  30న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ అనుకున్నారని టాక్ వచ్చింది. ప్రఖ్యాత స్ట్రీమింగ్ నెట్ వర్క్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముప్పై ఐదు కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు విరాటపర్వం టీమ్ ఓటీటీ డీల్‌ను క్యాన్సల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో ఈ సినిమాను డైరెక్ట్‌గా థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు.

  పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నారు దర్శకుడు వేణు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిచ్చారు. విరాటపర్వం సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ నిర్మించారు.

  Love Story : లవ్ స్టోరి సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు.. నాగ చైతన్య, సాయి పల్లవి అదరగొట్టారు..

  ఇక ఈ విరాటపర్వంలో రానా, సాయి పల్లవితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో.. నివేతా పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్‌, నవీన్ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్‌, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

  ఇక రానా నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే... రానా దగ్గుబాటి (Rana Daggubati) ఓ మలయాళీ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ”భీమ్లా నాయక్” (Bheemla Nayak) అనే పేరు ఖరారు చేశారు. యువ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు.

  Ritu Varma : ప్లోరల్ డ్రెస్‌లో అదరగొట్టిన బ్యూటీఫుల్ రితూ వర్మ..

  ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టైనా చిత్రం అయ్యప్పనమ్ కోషీయమ్ తెలుగు రీమేక్‌గా వస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి (Rana Daggubati) పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్యా మీనన్, (Nithya menen) సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలకానుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

  ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఓ పాటను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శనం మొగులయ్య పాడిన ఈ పాట ఎంతోగాను ఆకట్టుకుంది.

  ఇక రానా సినిమాల విషయానికి వస్తే.. ఆ మధ్య అరణ్య అనే సినిమాతో వచ్చారు. ఈ సినిమాలో అడవి, అడవి జంతువుల నేపథ్యంలో వాటి హక్కులు రక్షణ గురించి చర్చించారు. ఇక ఆయన ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ ఈ సినిమాను నిర్మించనున్నారు.

  ఈ సినిమాకు 'గృహం' ఫేమ్‌ డైరెక్టర్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్నాడని టాక్. మిలింద్ రావ్ తాజాగా (Nayanthara) నయనతార ప్రధాన పాత్రలో 'నెట్రికన్' అనే మిస్టరీ థ్రిల్లర్ ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు ధీరుడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఆయన ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ రానాలు కలిసి నటిస్తున్నారు. దీనికి రానా నాయుడు అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
  Published by:Suresh Rachamalla
  First published: