రామ్ చరణ్ ప్లేస్‌ను కొట్టేసిన రానా.. కారణం రాజమౌళినా...

Acharya : చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో సోషల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఆచార్య.

news18-telugu
Updated: July 15, 2020, 7:37 AM IST
రామ్ చరణ్ ప్లేస్‌ను కొట్టేసిన రానా.. కారణం రాజమౌళినా...
రానా,రామ్ చరణ్ Photo : Twitter
  • Share this:
Chiranjeevi : చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో సోషల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఆచార్య. దాదాపు సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు సంబందించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఓ అరగంటకు పైగా నిడివి ఉండే క్యారెక్టర్ కోసం మొదట మహేష్ బాబును అడిగినట్లు ఓ వార్త హల్ చల్ చేసింది. అంతేకాదు మహేష్ ఆ పాత్రలో నటించడానికి దాదాపు 30 కోట్లవరకు డిమాండ్ చేశాడని టాక్ నడిచింది. అయితే అలాంటిదేమి లేదని అసలు మహేష్‌ను ఆ పాత్ర కోసం పరిశీలించలేదని దర్శకుడు శివ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అని మరో రూమర్ నడిచింది. చివరగా రామ్ చరణ్ ఆ కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ చిత్రబృందం తేల్చింది. దీంతో అక్కడితో ఆ రూమర్ ఆగిపోయింది. అంతా మంచిగా జరిగితే రామ్ చరణ్ ఆచార్యలో నటించేవాడు. ముఖ్యంగా కరోనా కారణంగా రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ రెండు నెలలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆచార్య మూవీలో చరణ్ నటించడం కష్టమే అంటున్నారు. దీనితో అనేక మంది నటుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో భాగంగా క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. ఆయన చిరంజీవి సినిమాలో నటిస్తున్నాడని ఆ వార్తల సారాంశం. ఆ వార్తలపై ఎవరూ స్పందించలేదు. తాజాగా రానా పేరు తెరపైకి వచ్చింది. రానా చిరంజీవి ఆచార్యలో నటిస్తున్నాడంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. చూడాలి మరి ఈ వార్త ఎంత వరకు నిజమో.

ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: July 15, 2020, 7:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading