Rana Daggubati : అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రానా కొత్త సినిమా.. అధికారిక ప్రకటన..

Rana Photo : Twitter

ana Daggubati : రానా దగ్గుబాటి (Rana Daggubati).. ప్రఖ్యాత సినీ నిర్మాత రామనాయుడి మనవడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. అందులో భాగంగా ఆయన ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ అదరగొడుతున్నారు.

  • Share this:
    రానా దగ్గుబాటి (Rana Daggubati).. ప్రఖ్యాత సినీ నిర్మాత రామనాయుడి మనవడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. రానా ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు విలన్‌గాను అలరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తనకు మాత్రమే సాధ్యమయ్యే పాత్రలను పోషిస్తున్నారు. అందులో భాగంగా విరాటపర్వం (Virata Parvam) అనే సినిమాలో రానా ఓ విలక్షణ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమాతో పాటు విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి రానా ఓకే చెప్పారు. సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు 'గృహం' ఫేమ్‌ డైరెక్టర్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా దసరా సందర్భంగా విడుదలైంది. మిలింద్ రావ్ విషయానికి వస్తే... ఇటీవల ఆయన నయనతార ప్రధాన పాత్రలో 'నెట్రికన్' అనే మిస్టరీ థ్రిల్లర్ ని డైరెక్ట్ చేశారు.

    ఈ సినిమాకు ధీరుడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ రూపొందనుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం రూపొందనుంది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగనుందట.

    ఇక రానా సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల అరణ్య అనే సినిమాతో వచ్చారు. ఈ సినిమాలో అడవి, అడవి జంతువుల నేపథ్యంలో వాటి హక్కులు రక్షణ గురించి చర్చించారు. ఇక ఆయన ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో వస్తోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.



    రానా ఈ సినిమాలతో పాటు భీమ్లా నాయక్ అనే మరో సినిమాలోను నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్నారు. (Bheemla Nayak). యువ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మలయాళీ సినిమా అయ్యప్పనుమ్ కోషీయమ్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. కాగా ఈ సినిమాలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన మలయాళీ భామ సంయుక్తా మీనన్ నటిస్తున్నారు.

    ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలకానుంది. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

    ఈ సినిమాతో పాటు రానా ఓ వెబ్ సిరీస్‌లోను నటిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్, రానాలు కలిసి నటిస్తున్నారు. దీనికి రానా నాయుడు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.
    Published by:Suresh Rachamalla
    First published: