హోమ్ /వార్తలు /సినిమా /

Rana Daggubati : ఆ విషయంలో చేతబడులను క్షుద్ర పూజలను నమ్ముకున్న రానా..

Rana Daggubati : ఆ విషయంలో చేతబడులను క్షుద్ర పూజలను నమ్ముకున్న రానా..

రానా Photo : Twitter

రానా Photo : Twitter

Rana Daggubati : రానా తాజాగా ఓ హిందీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'గృహం' ఫేమ్‌ డైరెక్టర్ మిలింద్ రావ్ దర్శకత్వంలో రానా ఈ సినిమా చేయనున్నాడు.

  రానా దగ్గుబాటి.. తన ప్రేయసిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైయాడు. అది అలా ఉంటూ రానా తాజాగా ఓ హిందీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'గృహం' ఫేమ్‌ డైరెక్టర్ మిలింద్ రావ్ దర్శకత్వంలో రానా నటించనున్నాడు. మిలింద్ చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయిన రానా వెంటనే ఓకే చెప్పేశాడట. మంత్ర తంత్రాలు.. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కించనుంది చిత్రబృందం. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో 'నెట్రికన్' అనే మిస్టరీ థ్రిల్లర్ ని డైరెక్ట్ చేస్తున్న మిలింద్ రావ్ తన తర్వాత చిత్రాన్ని రానాతో చేయనున్నాడు. ఈ క్రమంలో రానా తో ఓ వైవిధ్యమైన సినిమా చేయడానికి స్టోరీ రెడీ చేసుకున్నాడు మిలింద్ రావ్. రానా ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ సినిమాలో ముఖ్యంగా క్షుద్ర పూజలు, చేతబడి గురించి చర్చించనున్నారట. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషలో రూపొందనున్నది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై ఆచంట గోపీనాథ్ నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ధీరుడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

  ఇక రానా ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన మరో ప్యాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడు. 'హాథీ మేరే సాథీ' పేరుతో వస్తోన్న ఈ సినిమాలో రానా చాలా కొత్తగా కనబడనున్నాడు . హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇది అడవి బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. రానా నటిస్తోన్న తెలుగు సినిమా.. విరాట పర్వం.  పొలిటికల్ థ్రిల్లర్‌ జానర్‌లో వస్తోన్న ఈ సినిమాలో  రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సాయి పల్లవి మరో కీలకపాత్రలో నటిస్తోంది. నక్సల్ బ్యాక్ గ్రౌండ్‌లో వస్తోన్న ఈ సినిమాకు ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమాతో ఓ కొత్త పాయింట్‌ను డిస్కస్ చేసి మంచి హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘వేణు ఊడుగుల’  దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిస్తున్నారు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయని పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మిలింద్ దర్శకత్వంలో రూపొందే చిత్రం చేస్తాడు రానా. ఈ సినిమాలతోపాటు రానా గుణశేఖర్‌ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప' అనే ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాతో పాటు ఓ వెబ్ సిరీస్‌కు కూడా ఓకే చెప్పాడు రానా. కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్, రానా దగ్గుబాటితో కలిసి వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. నెట్‌ఫ్లిక్స్ దీనిని నిర్మించబోతోందని సమాచారం అందుతోంది. వెబ్‌సిరీస్‌ను మొదటి తెలుగు భాషలో చిత్రీకరించి ఆ తర్వాత బహుళ భాషల్లో విడుదల చేస్తారట.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Rana daggubati

  ఉత్తమ కథలు