Virataparvam On NetFlix : నెట్‌ఫ్లిక్స్‌లో రానా దగ్గుబాటి సాయి పల్లవిల విరాటపర్వం..

Virataparvam Working still Rana, Venu Udugula Photo : Twitter

Virataparvam On NetFlix : రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30న విడుదలకావాల్సి ఉంది.

  • Share this:
    రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యినట్లు తెలుస్తోంది. విరాటపర్వంకు అదిరిపోయే ఓటీటీ ఆఫర్ వచ్చిందని సమాచారం. ప్రఖ్యాత స్ట్రీమింగ్ నెట్ వర్క్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముప్పై ఐదు కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ నటించిన రెండు చిత్రాలు ఓటీటీలోనే విడుదల కానున్నాయి. ఇప్పటకే ఆయన నటిస్తున్న యాక్షన్ డ్రామా “నారప్ప” అమెజాన్ ప్రైమ్ లో జూలై 20న విడుదల కాబోతుండగా..మరో సినిమా ‘దృశ్యం 2’ కూడా డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల అయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన త్వరలో విడుదలకావాల్సి వుంది.


    ఇక రానా సాయి పల్లవిల విరాటపర్వం విషయానికి వస్తే.... ఈ సినిమాను ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమాలో యూత్‌కు సంబందించి కొత్త అంశాన్ని చర్చించి మంచి హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘వేణు ఊడుగుల’ దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోంది. సినిమా ప్రధానంగా పొలిటికల్‌ థ్రిల్లర్ అయినా మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రస్ట్‌గా ఉంటాయని టాక్.

    ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నారు దర్శకుడు వేణు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం. కంటెంట్‌ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకూ పోషించనటువంటి పాత్రల్లో రానా, సాయి పల్లవి కనిపిస్తారు. ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్, నవీన్‌ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డి. సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: