రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్లో వస్తోన్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా సమ్మర్లో విడుదలకానుందని తెలిపింది చిత్రబృందం. భోగి సందర్భంగా ఈ ప్రకటన చేసింది చిత్రబృందం. షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుతోందని సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నామని తెలిపాడు రానా. భోగి పండుగ సందర్భంగా ఓ ఆహ్లాదకరమైన పోస్టర్‌ను విడుదలచేసిన రానా.. ఆ పోస్టర్లో సాయిపల్లవి చేయి పట్టుకుని సాగుతున్నాడు. నక్సల్ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాను ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమాలో యూత్‌కు సంబందించి కొత్త అంశాన్ని చర్చించి మంచి హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘వేణు ఊడుగుల’ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతోంది. సినిమా ప్రధానంగా పొలిటికల్ థ్రిల్లర్ అయినా మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రస్ట్‌గా ఉంటాయని టాక్. ఈ సినిమాలో రానా పాత్ర పాజిటివ్ ఆటీట్యూడ్‌తో పాటు కొంత నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటుందని అదే ఈ సినిమాలో కొత్తగా ఉండనుందని సమాచారం. మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథే ఈ విరాట పర్వం అని అంటున్నారు.
దీనికి తోడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ న్యూ యాంగిల్ లో దర్శకుడు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నాడు దర్శకుడు వేణు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం.
ఇక రానా ప్రస్తుతం చేస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. 'గృహం' ఫేమ్ డైరెక్టర్ మిలింద్ రావ్ దర్శకత్వంలో నటించనున్నాడు. రానా ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ సినిమాలో ముఖ్యంగా క్షుద్ర పూజలు, చేతబడి గురించి చర్చించనున్నారట. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషలో రూపొందనున్నది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై ఆచంట గోపీనాథ్ నిర్మించనున్నారు. రానా మరో ప్యాన్ ఇండియన్ సినిమా 'హాథీ మేరే సాథీ' . ఈ సినిమాలతోపాటు రానా గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప' అనే ఓ సినిమా చేయనున్నాడు.