హోమ్ /వార్తలు /సినిమా /

Viraataparvam : థియేటర్‌లోనే విరాటపర్వం.. విడుదల తేది ఖరారు.. అధికారిక ప్రకటన..

Viraataparvam : థియేటర్‌లోనే విరాటపర్వం.. విడుదల తేది ఖరారు.. అధికారిక ప్రకటన..

Virata Parvam theatre release date confirmed Photo : Twitter

Virata Parvam theatre release date confirmed Photo : Twitter

Viraataparvam : విరాటపర్వం సినిమా ఓటీటీలో విడుదలకానున్నట్లు.. ప్రఖ్యాత స్ట్రీమింగ్ నెట్ వర్క్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముప్పై ఐదు కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని పేర్కోంటూ సినిమా థియేటర్‌లోని విడుదలకానుందని ప్రకటించింది. ఇక తాజాగా ఈ సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చింది.

ఇంకా చదవండి ...

  రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిపల్లవి  (Sai Pallavi) ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న లేటెస్ట్ చిత్రం విరాటపర్వం (Virataparvam). వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుండగా కరోనా వచ్చి రిలీజ్ వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా 2021 ఏప్రిల్ 30న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ అనుకున్నారని టాక్ వచ్చింది. ప్రఖ్యాత స్ట్రీమింగ్ నెట్ వర్క్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముప్పై ఐదు కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని పేర్కోంటూ సినిమా థియేటర్‌లోని విడుదలకానుందని ప్రకటించింది. ఇక తాజాగా ఈ సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమా జూలై 1న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ సోషల్‌ మీడియా వేదికగా అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో ఈ సినిమాపై వస్తున్న రూమర్స్‌కు బ్రేక్స్ పడ్డాయి. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న విరాటపర్వంలో రానా కామ్రేడ్‌ రవన్నగా కనిపించనున్నారు. మరో నటి ప్రియమణి భరతక్క అనే ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సెన్సార్ విషయంలో కూడా ఇబ్బుందలు ఏర్పడ్డాయని ఆ మధ్య టాక్ నడిచిన విషయం తెలిసిందే.

  ఇక విరాటపర్వం  (Viraataparvam) సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో(Rana Daggubati)  రానా, సాయి పల్లవి ,నివేతా పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్‌, నవీన్ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్‌, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విరాటపర్వం  (Viraataparvam) సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ద‌గ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సుధాక‌ర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

  పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోంది. సినిమా ప్రధానంగా పొలిటికల్‌ థ్రిల్లర్ అయినా మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రస్ట్‌గా ఉంటాయని టాక్. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నారట దర్శకుడు వేణు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనుందని తెలుస్తోంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Rana daggubati, Sai Pallavi, Tollywood news, Virata Parvam

  ఉత్తమ కథలు