Home /News /movies /

RANA DAGGUBATI SAI PALLAVI VENU UDUGULA VIRATA PARVAM GRAND EVENT WILL HAPPEN TODAY WARANGAL HERE ARE THE DETAILS SR

Viraataparvam : వరంగల్‌లో విరాటపర్వం టీమ్ సందడి.. గ్రాండ్‌గా ఆత్మీయ వేడుక కార్యక్రమం...

Virata Parvam grand event Photo : Twitter

Virata Parvam grand event Photo : Twitter

Viraataparvam : ఈ సినిమాను జూన్ 17, 2022న గ్రాండ్ థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు సాయంత్రం వరంగల్‌లో ఆత్మీయ వేడుక పేరుతో ఓ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. హన్మకొండలోని సుబేదారిలోని యూనివర్శిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు మొదలుకానుంది.

ఇంకా చదవండి ...
    రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిపల్లవి  (Sai Pallavi) ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న లేటెస్ట్ చిత్రం విరాటపర్వం (Virataparvam). వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుండగా కరోనా వచ్చి రిలీజ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ అనుకున్నారని టాక్ వచ్చింది. ప్రఖ్యాత స్ట్రీమింగ్ నెట్ వర్క్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముప్పై ఐదు కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని పేర్కోంటూ (Virataparvam) ఈ సినిమా థియేటర్‌లోని విడుదలకానుందని జూలై 1న విడుదల చేస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా అధికారిక ప్రకటన ఇచ్చింది టీమ్. ఇక ఆ తర్వాత విడుదల తేది మరోసారి మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను జూన్ 17, 2022న గ్రాండ్ థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు సాయంత్రం వరంగల్‌లో ఆత్మీయ వేడుక పేరుతో ఓ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. హన్మకొండలోని సుబేదారిలోని యూనివర్శిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు మొదలుకానుంది. ఈ కార్యక్రమానికి సినిమా టీమ్ మొత్తం హాజరుకానుంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది టీమ్.

    ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే నగాదారిలో (Nagaa daarilo) తాజాగా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ పాటను సురేష్ బొబ్బిలి కంపోజ్ చేశారు. వరం పాడారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఛలో ఛలో(Chalo Chalo) అంటూ సాగే ఈ పాటను రానా పాడారు. ఈ పాట ఈరోజు విడుదలకానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న విరాటపర్వంలో రానా కామ్రేడ్‌ రవన్నగా కనిపించనున్నారు. మరో నటి ప్రియమణి భరతక్క అనే ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.


    విరాటపర్వం  (Viraataparvam) సినిమాలో(Rana Daggubati)  రానా, సాయి పల్లవి ,నివేతా పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్‌, నవీన్ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్‌, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విరాటపర్వం  (Viraataparvam) సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ద‌గ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సుధాక‌ర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Rana daggubati, Sai Pallavi, Virataparvam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు