హోమ్ /వార్తలు /సినిమా /

Virataparvam : నెట్‌ఫ్లిక్స్‌‌తో డీల్ రద్దు చేసుకున్న విరాటపర్వం టీమ్..

Virataparvam : నెట్‌ఫ్లిక్స్‌‌తో డీల్ రద్దు చేసుకున్న విరాటపర్వం టీమ్..

Virataparvam : రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం.

Virataparvam : రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం.

Virataparvam : రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం.

  రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ అనుకున్నారని టాక్ వచ్చింది. ప్రఖ్యాత స్ట్రీమింగ్ నెట్ వర్క్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముప్పై ఐదు కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు విరాటపర్వం టీమ్ ఓటీటీ డీల్‌ను క్యాన్సల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. అందులో భాగంగా ఈరోజు సత్యదేవ్ తిమ్మరుసు, తేజా సజ్జా ఇష్క్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో విరాటపర్వం కూడా థియేటర్ రిలీజ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.


  విరాటపర్వంలో.. ఈ సినిమాలో రానా, సాయి పల్లవి ,నివేతా పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్‌, నవీన్ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్‌, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విరాటపర్వం సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

  పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోంది. సినిమా ప్రధానంగా పొలిటికల్‌ థ్రిల్లర్ అయినా మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రస్ట్‌గా ఉంటాయని టాక్. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నారు దర్శకుడు వేణు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం.

  First published:

  Tags: Rana daggubati, Tollywood news, Virata Paravam

  ఉత్తమ కథలు