• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RANA DAGGUBATI SAI PALLAVI AND VENU UDUGULA VIRAATA PARVAM TO RELEASE ON APRIL 30 SR

Rana Daggubati | Sai Pallavi : వేసవి పోరులో రానా.. ఒకే నెలలో ఐదు సినిమాలు.. రసవత్తరంగా ఏప్రిల్..

Rana Daggubati | Sai Pallavi : వేసవి పోరులో రానా.. ఒకే నెలలో ఐదు సినిమాలు.. రసవత్తరంగా ఏప్రిల్..

Rana viraata parvam release date Photo : Twitter

Rana Daggubati | Sai Pallavi : రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ‘విరాటపర్వం’.

  • Share this:
    రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా 90వ దశకంలో తెలంగాణలోని నక్సల్ ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు సమర్పిస్తున్నాడు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి మరోఅప్ డేట్ వచ్చింది. విరాటపర్వం సమ్మర్ కానుకగా విడుదల కానుంది. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను చిత్రబృందం విడుదలచేసింది. విరాటపర్వం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక ఇదే విషయాన్ని ఈ సినిమా దర్శకుడు వేణు తన సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్‌తో పంచుకున్నాడు. అయితే ఇప్పటికే ఏప్రిల్ నెలలో చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిందీ పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్, నాచరల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’, అక్కినేని నటవారసుడు నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’, మాచో స్టార్ గోపీచంద్ ‘సీటిమార్’ వరుసగా విడుదల కానున్నాయి. ఇక తాజాగా రానా విరాటపర్వం కూడా చేరడంతో రసవత్తరంగా మారింది.

    విరాటపర్వం విషయానికి వస్తే.. నక్సల్ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాను ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమాలో యూత్‌కు సంబందించి కొత్త అంశాన్ని చర్చించి మంచి హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘వేణు ఊడుగుల’ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోంది.


    సినిమా ప్రధానంగా పొలిటికల్‌ థ్రిల్లర్ అయినా మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రస్ట్‌గా ఉంటాయని టాక్. ఈ సినిమాలో రానా పాత్ర పాజిటివ్ ఆటీట్యూడ్‌తో పాటు కొంత నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటుందని అదే ఈ సినిమాలో కొత్తగా ఉండనుందని సమాచారం. మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథే ఈ విరాట పర్వం అని అంటున్నారు. దీనికి తోడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ న్యూ యాంగిల్ లో దర్శకుడు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది.



    అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నాడు దర్శకుడు వేణు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం. కంటెంట్‌ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకూ పోషించనటువంటి పాత్రల్లో రానా, సాయి పల్లవి కనిపిస్తారు. ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్, నవీన్‌ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు