రానా ప్యాన్ ఇండియా సినిమా ఓటిటిలో విడుదల కానుందా..?

Rana Daggubati Aranya: థియేటర్స్ లాక్‌డౌన్ సందర్భంగా పెద్ద సినిమాలతో పాటు చాలా వరకు చిన్న సినిమాలు కూడా ఆగిపోయాయి. దాదాపు వందల సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 29, 2020, 10:43 PM IST
రానా ప్యాన్ ఇండియా సినిమా ఓటిటిలో విడుదల కానుందా..?
రానా దగ్గుబాటి అరణ్య సినిమా (rana daggubati aranya)
  • Share this:
థియేటర్స్ లాక్‌డౌన్ సందర్భంగా పెద్ద సినిమాలతో పాటు చాలా వరకు చిన్న సినిమాలు కూడా ఆగిపోయాయి. దాదాపు వందల సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ థియేటర్స్ ఓపెన్ లేవు. దాంతో నిర్మాతలకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే వాళ్లు కూడా మరో ప్రత్యామ్నాయం దిశగా అడుగేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటిటి ప్లాట్ ఫామ్ అందరికీ కనిపిస్తుంది. ఇప్పటికే అమెజాన్ దాదాపు అరడజన్‌కు పైగా సినిమాలను కొనేసింది. నేరుగా విడుదల చేస్తుంది. ఇప్పుడు రానా దగ్గుబాటి హీరోగా వస్తున్న అరణ్య కూడా నేరుగా డిజిటల్‌లో విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది.

రానా దగ్గుబాటి అరణ్య సినిమా (rana daggubati aranya)
రానా దగ్గుబాటి అరణ్య సినిమా (rana daggubati aranya)


ఈ సినిమా టీజర్ అదిరిపోయింది.. మంచి అప్లాజ్ వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ తెరకెక్కింది ఈ చిత్రం. నార్త్‌లో దీనికి హాథీ మేరె సాథీ.. తమిళంలో కాండన్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ప్రభు సాల్మాన్. ఏప్రిల్ 2న విడుదల చేయాలని అనుకున్నా కూడా కరోనా అన్నీ పాడు చేసింది. దాంతో ఇప్పుడు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషలకు కూడా నిర్మాతల దగ్గరికి అదిరిపోయే ఓటిటి డీల్ వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా హక్కులను తమకు ఇవ్వాలంటూ నెట్ ఫ్లిక్స్ నేరుగా నిర్మాత సురేష్ బాబును అడిగారని ప్రచారం జరుగుతుంది.

రానా దగ్గుబాటి అరణ్య సినిమా (rana daggubati aranya)
రానా దగ్గుబాటి అరణ్య సినిమా (rana daggubati aranya)


బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను నిర్మించింది.. కానీ రానా హీరో కాబట్టి సురేష్ బాబు దగ్గరకు వచ్చారని తెలుస్తుంది. ఆయన కూడా సానుకూలంగానే ఉన్నాడని.. దర్శక నిర్మాతలను అడిగి తన నిర్ణయం చెప్తానని సురేష్ బాబు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏనుగులు ఉన్న సీన్స్ షూటింగ్ చేయడానికి థాయ్‌ల్యాండ్ వెళ్లారు. ఇందులో తమిళ హీరో విష్ణు విశాల్ కీలక పాత్ర పోషించాడు. నిజంగానే ఈ ప్యాన్ ఇండియన్ సినిమా కానీ ఓటిటిలో విడుదలైతే అదో సంచలనమే.
First published: June 29, 2020, 10:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading