Rana Miheeka Marriage : రానా, మిహీకాల పెళ్లి శుభలేఖను చూస్తే మతిపోవాల్సిందే..

Rana Miheeka Marriage : నటుడు రానా దగ్గుబాటి సడెన్‌గా తన ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: July 24, 2020, 8:38 AM IST
Rana Miheeka Marriage : రానా, మిహీకాల పెళ్లి శుభలేఖను చూస్తే మతిపోవాల్సిందే..
రానా, మిహీకా Photo : Instagram
  • Share this:
నటుడు రానా దగ్గుబాటి సడెన్‌గా తన ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. తాను మిహీక బజాజ్‌తో ప్రేమలో ఉన్నానని.. తెలుపుతూ తన ప్రేమను మిహిక అంగీకరించదని తెలిపాడు. అంతేకాదు వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇరు వైపులా అంగీకరించడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. అందులో భాగంగా ఇటీవల ఇటీవల రెండు కుటుంబాల వారు కలిసి రోకా వేడుకను కూడా నిర్వహించుకున్నారు. ఆ తర్వాత ఆగస్ట్‌లో వీరి పెళ్లి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడిచింది. అయితే కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లోకొంతమంది బంధువులు సన్నిహితలు సమక్షంలో రానా మిహీకాల వివాహం జరపనున్నార ని తెలుస్తుంది. రానా దగ్గుబాటి పెళ్లి ఇప్పటికే ఖరారు కాగా, పెళ్లి వేదిక, తేదీ అఫీషియల్‌గా ప్రకటించలేదు కుటుంబ సభ్యులు. అయితే తాజాగా ఇరు కుటుంబాలు రానా, మిహిక పెళ్లి తేదీలను అధికారికంగా ప్రకటించారు. అందులో భాగంగా రానా పెళ్లికి సంబంధించిన వివాహ పత్రికను సినిమా స్టైల్లో అద్భుతంగా డిజైన్ చేశారు.

ana daggubati miheeka wedding invitation, Rana and miheeka bajaj marriage, rana, rana love, miheeka, miheeka love, rana and miheeka love story, rana daggubati news, రానా, మిహికా, టాలీవుడ్ న్యూస్
రానా పెళ్లి పత్రిక Photo : Youtube


వివాహ పత్రికను పౌరాణికం థీమ్‌గా రూపొందించడం ఆకట్టుకొంటున్నది. ఎన్టీఆర్, ఏన్నార్ నటించిన 'మాయాబజార్' చిత్రంలోని ప్రియ దర్శని సన్నివేశాన్ని తీసుకొని ఆ వివాహ పత్రికన వీడియోను డిజైన్ చేశారు. ఇది చూడాడానికి ఎంతో ముచ్చటగా ఉంది. ఆ వీడియోలోనే రానా, మిహికా పెళ్లికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా వేదిక, సమయం, రిసెప్షన్ లాంటి వివరాలను తెలియజేశారు. ఇక ఈ ప్రేమ జంట పెళ్ళి అనుకున్నట్లుగానే ఆగస్టు 08వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు, చైతన్య ఎన్‌క్లేవ్, ఖాజాగూడ, మణికొండ, హైదరాబాద్‌లో జరుగునుందని ఆ వీడియో ద్వారా తెలిపారు.

ఇక పెళ్లి తేది దగ్గర పడుతుండడంతో రానా తండ్రి సురేష్ బాబు పెళ్లికి సంబందించిన అన్ని ఏర్పాట్లని చకా చకా చేస్తున్నారట. అయితే కరోనా నేపథ్యంలో కొద్ది మంది బంధువులు, సన్నిహితలు సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్టు సమాచారం. ఇక ఈ మధ్యే లాక్‌డౌన్ సమయంలో నిఖిల్ తన ప్రేయసి పల్లవి వర్మను పెళ్ళాడగా, నితిన్ కూడా ఇటీవలే ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇరు వైపుల వారు తాంబూళాలు మార్చుకున్నారు. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్యాలెస్‌లో పెళ్లి వేడుక జరుగనుంది. మరో రెండు రోజుల్లో షాలినీ మెడలో నితిన్ మూడు ముళ్లు వేయనున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: July 24, 2020, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading