• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • RANA DAGGUBATI MIHEEKA BAJAJ SPOTTED IN HYDERABAD AIRPORT AND THEY COMPLETED TOUR PK

Rana Daggubati - Miheeka: ఎయిర్ పోర్టులో రానా, మిహీక జంట.. టూర్‌కు వెళ్తున్నారా ? వెళ్ళొస్తున్నారా ?

రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (Rana Daggubati Miheeka Bajaj)

Rana Daggubati - Miheeka: టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్స్‌లో రానా, మిహీక కూడా ఉంటారు. పెళ్లై ఆర్నెళ్లు కూడా కాకముందే ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు. రానా, మిహీక జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు కూడా అవసరం లేదు.

  • Share this:
టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్స్‌లో రానా, మిహీక కూడా ఉంటారు. పెళ్లై ఆర్నెళ్లు కూడా కాకముందే ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు. రానా, మిహీక జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు కూడా అవసరం లేదు. గతేడాది ఆగస్ట్ 8న లాక్‌డౌన్ సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి సందడి లేకుండా.. హంగు ఆర్భాటాలకు పోకుండా సింపుల్‌గా 30 మంది మధ్యలో పెళ్లి చేసుకున్నాడు రానా. తర్వాత కొందరు మిత్రులకు పిలిచి పార్టీ కూడా ఇచ్చాడు. పెళ్లి తర్వాత కొన్ని రోజుల వరకు పూజాలతోనే బిజీగా గడిపేసిన రానా.. ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిపోయాడు. హనీమూన్ కూడా వారం రోజుల్లోనే ముగించుకుని వచ్చేసారు. పైగా కోవిడ్ కారణంగా బయటికి కూడా ఎక్కడికి వెళ్లలేదు. అప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ కావడంతో ఇండియాలోనే ఉండిపోయారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ జంట బయటికి వెళ్తున్నారు. ఇంత బిజీలో కూడా తనకంటూ ప్రత్యేకమైన స్పేస్ తీసుకుంటున్నాడు రానా. బయటికి వెళ్లి భార్యతో టూర్స్ ఎంజాయ్ చేస్తున్నాడు రానా. తాజాగా ఈ ఇద్దరూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. అదిరిపోయే క్యాస్ట్యూమ్స్‌తో దగ్గుబాటి జోడీ అదుర్స్ అనిపించారు. ఇప్పటికే ముంబై, గోవా సహా మరికొన్ని ప్రదేశాలకు కూడా వెళ్లొచ్చారు. ఇప్పుడు మరోసారి కొన్ని రోజుల టూర్ ఎంజాయ్ చేసొచ్చారు రానా, మిహీక. అక్కడ్నుంచి వస్తూ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు.
rana daggubati,rana daggubati twitter,rana daggubati miheeka bajaj,rana daggubati miheeka bajaj tour,rana daggubati miheeka bajaj in hyderabad airport,telugu cinema,rana daggubati movies,రానా దగ్గుబాటి,మిహీక బజాజ్,రానా దగ్గుబాటి మిహీక బజాజ్ టూర్స్
రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (Rana Daggubati Miheeka)

దాంతో ఈ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పర్సనల్ టూర్ పూర్తి కావడంతో సినిమాలతో బిజీ అవుతున్నాడు రానా. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజన్ సినిమాలున్నాయి. అందులో ముందుగా విరాట పర్వం అయితే విడుదల కానుంది. దాంతో పాటు తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాడు రానా.
Published by:Praveen Kumar Vadla
First published: