Rana Daggubati: సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన రానా, మిహీక దంపతులు..

Rana Daggubati Miheeka: దగ్గుబాటి వారసుడు రానా దగ్గుబాటి వివాహం ఆగస్ట్ 8న మిహికా బజాజ్‌తో జరిగింది. అతి తక్కువ మంది సమక్షంలోనే వైభవంగా జరిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 11, 2020, 9:32 AM IST
Rana Daggubati: సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన రానా, మిహీక దంపతులు..
రానా మిహీక బజాజ్ సత్యనారాయణ స్వామి వ్రతం (rana miheeka bajaj)
  • Share this:
దగ్గుబాటి వారసుడు రానా దగ్గుబాటి వివాహం ఆగస్ట్ 8న మిహికా బజాజ్‌తో జరిగింది. అతి తక్కువ మంది సమక్షంలోనే వైభవంగా జరిగింది. అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత వ్రతాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే ఆగస్ట్ 10న రానా ఇ:ట సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు జరిగాయి. కొత్త దంపతులు ఈ పూజలో పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
రానా దగ్గుబాటి మిహీక బజాజ్ పెళ్లి సందడి (rana daggubati miheeka bajaj marriage)
రానా దగ్గుబాటి మిహీక బజాజ్ పెళ్లి సందడి (rana daggubati miheeka bajaj marriage)

రానా తెల్లని దుస్తులలో నవ్వుతూ కనిపిస్తుండగా.. మిహికా ఆకుపచ్చ బంగారు కలిసిన చేనేత చీరతో పాటు ఎర్రటి దుప్పట్టా ధరించింది. ఇద్దరూ నవ్వుతూ కెమెరాకు పోజిచ్చారు. సత్యనారాయణ వ్రతం తర్వాత కుటుంబం అంతా కలిసి నూతన వధూవరులతో ఫోటో దిగారు. ఇందులో వెంకటేష్ దంపతులు, పిల్లలు, సమంత, నాగ చైతన్య, దగ్గుబాటి సురేష్ బాబు దంపతులు ఉన్నారు. త్వరలోనే ఇండస్ట్రీకి భారీ పార్టీ ఇవ్వనున్నాడు రానా దగ్గుబాటి.
Published by: Praveen Kumar Vadla
First published: August 11, 2020, 9:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading