హోమ్ /వార్తలు /సినిమా /

Rana Daggubati Miheeka: రానా దగ్గుబాటి, మిహీక బజాజ్ హనీమూన్ ఎక్కడో తెలుసా..?

Rana Daggubati Miheeka: రానా దగ్గుబాటి, మిహీక బజాజ్ హనీమూన్ ఎక్కడో తెలుసా..?

రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (rana daggubati miheeka bajaj marriage)

రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (rana daggubati miheeka bajaj marriage)

Rana Daggubati: దగ్గుబాటి వారసుడు రానా పెళ్లి వేడుకలు ఆ మధ్య ఘనంగా జరిగాయి. లాక్‌డౌన్‌లో అన్ని నిబంధనలు పాటిస్తూ చాలా తక్కువ మంది సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు రానా.

దగ్గుబాటి వారసుడు రానా పెళ్లి వేడుకలు ఆ మధ్య ఘనంగా జరిగాయి. లాక్‌డౌన్‌లో అన్ని నిబంధనలు పాటిస్తూ చాలా తక్కువ మంది సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు రానా. తనకు నచ్చిన మిహీకా బజాజ్‌తోనే ఏడడుగులు నడిచాడు ఈయన. పెళ్లి తర్వాత కొన్ని రోజులు పూర్తిగా పూజలు పునస్కారాలతో గడిపేసాడు రానా. ఆ తర్వాత చాలా క్లోజ్ సర్కిల్‌తో కలిసి పార్టీలు కూడా చేసుకున్నాడు. ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు కూడా ఈ పార్టీలకు వచ్చారు. ఇదిలా ఉంటే పార్టీలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు హనీమూన్ ప్లాన్ చేసుకున్నాడు రానా.

రానా మిహీక బజాజ్ సత్యనారాయణ స్వామి వ్రతం (rana miheeka bajaj)
రానా మిహీక బజాజ్ సత్యనారాయణ స్వామి వ్రతం (rana miheeka bajaj)

తన భార్యతో కలిసి ఇండియా దాటకుండా ఇక్కడే ఉండి అద్భుతమైన ప్లేస్ వెళ్లాడు రానా. ఇండియాలో చాలా మంది ప్రిఫెర్ చేసే గోవాలోనే తన హనీమూన్ ప్లాన్ చేసుకున్నాడు రానా. ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫారెన్ వెళ్లడం అనేది మంచిది కాదు. అందుకే ఫారెన్ కంట్రీస్ కాకుండా మన కంట్రీలోనే ఉన్న గోవాకు వెళ్లారు రానా దంపతులు. అయితే హనీమూన్‌‌లో కూడా తన ప్రొఫెషనల్ పనులు ఆపట్లేదు ఈయన.

రానా దగ్గుబాటి మిహీక బజాజ్ పెళ్లి సందడి (rana daggubati miheeka bajaj marriage)
రానా దగ్గుబాటి మిహీక బజాజ్ పెళ్లి సందడి (rana daggubati miheeka bajaj marriage)

గోవా నుంచే యానిమేషన్‌ కామెడీ షో 'వై ఆర్‌ యు' అనౌన్స్‌ చేశాడు దగ్గుబాటి వారసుడు. హీరో కాకముందు రానా విజువల్ ఎఫెక్స్‌తో పాటు యానిమేషన్‌, డీఐ రంగంలో కొన్నాళ్లు పని చేశాడు. ఆ అనుభవం ఇప్పుడు పని చేస్తుంది. అప్పట్లో దీనిపై ఓ కంపెనీ కూడా రన్‌ చేశాడు ఈయన. ప్రకాశ్ కోవెలమూడి తెరకెక్కించిన బొమ్మలాట సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు రానా. ఇదిలా ఉంటే ఇప్పుడు లాక్‌డౌన్‌లో కొత్తగా ఏం చేయాలని ఆలోచించి యానిమేషన్‌ షోకి ప్లాన్‌ చేశాడు. త్వరలో ఈ షో స్టార్ట్‌ చేసే ఆలోచనలో ఉన్నాడు రానా. మొత్తానికి హనీమూన్‌లో కూడా ప్రొఫెషనల్ వర్క్స్ పూర్తి చేస్తున్నాడు రానా.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Miheeka Bajaj, Rana daggubati, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు