హోమ్ /వార్తలు /సినిమా /

Rana Daggubati : అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్‌లు.. దుమ్ము లేపుతోన్న రానా..

Rana Daggubati : అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్‌లు.. దుమ్ము లేపుతోన్న రానా..

తెలుగు ఇండస్ట్రీలో రానా మాదిరి అన్ని పాత్రల్లో నటించే నటులు చాలా తక్కువగా ఉన్నారు. విలన్‌గా చేస్తాడు.. హీరోగా నటిస్తాడు.. అదే సమయంలో చిన్న పాత్రలో నటించమంటే అది కూడా చేస్తాడు. పదేళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు రానా ఎన్నో అద్భుతాలు చేసాడు.

తెలుగు ఇండస్ట్రీలో రానా మాదిరి అన్ని పాత్రల్లో నటించే నటులు చాలా తక్కువగా ఉన్నారు. విలన్‌గా చేస్తాడు.. హీరోగా నటిస్తాడు.. అదే సమయంలో చిన్న పాత్రలో నటించమంటే అది కూడా చేస్తాడు. పదేళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు రానా ఎన్నో అద్భుతాలు చేసాడు.

Rana Daggubati : రానా దగ్గుబాటి.. ఇటీవలే తన ప్రేయసిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైయాడు. ఆ పెళ్లి తంతు పూర్తైందో లేదో.. రానా తాజాగా ఓ హిందీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

    రానా దగ్గుబాటి.. ఇటీవలే తన ప్రేయసిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైయాడు. ఆ పెళ్లి తంతు పూర్తైందో లేదో.. రానా తాజాగా ఓ హిందీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'గృహం' ఫేమ్‌ డైరెక్టర్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రానా హీరోగా నటించనున్నాడు. మిలింద్ చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయిన రానా వెంటనే ఓకే చెప్పేశాడట. మంత్ర తంత్రాలు.. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కించనుంది చిత్రబృందం. దీంతో ఈ సినిమాలో గ్రాఫిక్స్‌ను విపరీతంగా వాడనున్నారట. అందులో భాగంగా వీఎఫ్ఎక్స్ కు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మాత సురేష్ బాబు, గోపీనాథ్ ఆచంట కలసి సంయుక్తంగా భారీ బడ్జెట్టుతో నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్‌ల్లో విడుదలకానుంది.

    ఇక రానా ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన మరో ప్యాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడు. 'హాథీ మేరే సాథీ' పేరుతో వస్తోన్న ఈ సినిమాలో రానా చాలా కొత్తగా కనబడనున్నాడు . హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇది అడవి బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. రానా నటిస్తోన్న తెలుగు సినిమా.. విరాట పర్వం.  పొలిటికల్ థ్రిల్లర్‌ జానర్‌లో వస్తోన్న ఈ సినిమాలో  రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సాయి పల్లవి మరో కీలకపాత్రలో నటిస్తోంది. నక్సల్ బ్యాక్ గ్రౌండ్‌లో వస్తోన్న ఈ సినిమాకు ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమాతో ఓ కొత్త పాయింట్‌ను డిస్కస్ చేసి మంచి హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘వేణు ఊడుగుల’  దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది.

    అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిస్తున్నారు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయని పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరించిన కరోనా కారణంగా వాయిదాపడింది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో తిరిగి మొదలవుతుంది. దీని తర్వాత మిలింద్ దర్శకత్వంలో రూపొందే చిత్రం చేస్తాడు రానా. ఈ సినిమాలతోపాటు రానా గుణశేఖర్‌ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప' అనే ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం 'హిరణ్యకశ్యప' ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌లో ఉంది. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.

    ఈ సినిమాతో పాటు ఓ వెబ్ సిరీస్‌కు కూడా ఓకే చెప్పాడు రానా. కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్, రానా దగ్గుబాటితో కలిసి వెబ్ సిరీస్‌లో నటించనున్నారు . ఈ వెబ్‌సిరీస్ కోసం ప్రముఖ తెలుగు దర్శకుడు కథను అదించారని, నెట్‌ఫ్లిక్స్ దీనిని నిర్మించబోతోందని సమాచారం అందుతోంది. వెబ్‌సిరీస్‌ను మొదటి తెలుగు భాషలో చిత్రీకరించి ఆ తర్వాత బహుళ భాషల్లో విడుదల చేస్తారట. ఈ వెబ్ సిరీస్‌ పది ఎపిసోడ్‌ల థ్రిల్లర్ ‌గా ఉండనుందని సమాచారం. ఇలా రానా ఓ వైపు సినిమాలను చేస్తూనే.. మరోవైపు అటు డిజిటల్ వరల్డ్‌లో కూడా తన సత్తాను చూపించనున్నాడు. ఇక ఇంతకు ముందే ఓ యాప్ కోసం రానా నెంబర్ వన్ యారి పేరిట ఓ టాక్ షోను నిర్వహించిన సంగతి తెలిసిందే.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Rana daggubati

    ఉత్తమ కథలు