అన్ని ఫ్యామిలీస్‌లోనూ మల్టీస్టారర్స్ వస్తున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ కూడా కలిసి నటిస్తున్నారు ఆచార్యలో. దాంతో దగ్గుబాటి ఫ్యాన్స్ కూడా తమకు కూడా సాలిడ్ మల్టీస్టారర్ ఒకటి కావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అయితే దానికి సరైన కథ మాత్రం దొరకడం లేదు. ఇన్నాళ్లకు ఆ కథ కుదిరినట్లు తెలుస్తుంది. దృశ్యం 2లో రానా దగ్గుబాటి కూడా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. సీనియర్ హీరో వెంకటేష్ ప్రస్తుతం రిస్క్ అస్సలు తీసుకోవడం లేదు. సింపుల్‌గా రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. పక్క భాషల్లో హిట్ అయిన సినిమాలను ఇక్కడ రీమేక్ చేసుకుంటున్నాడు వెంకీ. కెరీర్ మొదటి నుంచి కూడా వెంకటేష్‌కు రీమేక్ కింగ్ అనే పేరుంది. ఇప్పటికీ అదే నిరూపించుకుంటున్నాడు కూడా. తాజాగా ఈయన దృశ్యం 2 రీమేక్‌లో నటిస్తున్నాడు. దాంతో పాటు అసురన్ రీమేక్ నారప్పలో కూడా నటిస్తున్నాడు వెంకీ. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తైపోయింది. దాంతో ఎఫ్ 3తో పాటు దృశ్యం 2పై ఫోకస్ చేసాడు ఈయన. ఈ మధ్యే పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. ఇందులో రానా దగ్గుబాటితో పాటు సమంత కూడా నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. దృశ్యం 2లో కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్రలో రానా కనిపించబోతున్నాడు. సమంత కూడా మరో కీలక పాత్ర చేస్తుందని తెలుస్తుంది.
వెంకటేష్, రానా కలిసి నటిస్తారంటే దగ్గుబాటి అభిమానులకు అంతకంటే కావాల్సిందేం ఉంది. చాలా కాలంగా ఈ కాంబినేషన్ కోసం చూస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా వెంకటేష్ జోడిగా మీనానే నటిస్తుంది. తాజాగా ఈమె సెట్స్‌లో కూడా జాయిన్ అయింది. సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడుతో కలిసి కొన్ని ఫోటోలకు పోజులు కూడా ఇచ్చింది.
ఈ సినిమాను తెలుగులోనే కాదు అన్ని భాషల్లో రీమేక్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. 2021లో వెంకటేష్ నుంచి మూడు సినిమాలు రానున్నాయి. నారప్ప మే 14న.. ఎఫ్ 3 ఆగస్ట్ 27న.. డిసెంబర్లో దృశ్యం 2 విడుదల కానున్నాయి. ఏదేమైనా కూడా రానా, వెంకీ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drishyam 2, Rana daggubati, Telugu Cinema, Tollywood, Venkatesh