హోమ్ /వార్తలు /సినిమా /

సమంత విషయంలో సైలెంట్‌గా వేశాడు.. నాగచైతన్యపై రానా పోస్టు.. నెటిజన్ల రియాక్షన్

సమంత విషయంలో సైలెంట్‌గా వేశాడు.. నాగచైతన్యపై రానా పోస్టు.. నెటిజన్ల రియాక్షన్

రానా దగ్గుబాటి, నాగ చైతన్య (File/Photo)

రానా దగ్గుబాటి, నాగ చైతన్య (File/Photo)

రానా పెట్టిన పోస్టుపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఇక్కడేదో తేడా కొడుతుంది అంటూ.. రానా దగ్గుబాటి పెట్టిన పోస్టుపై ఓనెటిజన్ మాత్రం సందేహం వ్యక్తం చేశాడు.

టాలీవుడ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya),సమంత(Samantha) విడాకులు తర్వాత వారు ఇద్దరు ఏం చేసిన హాట్ టాపిక్‌గా మారుతున్నారు. వీరిద్దరు ఏ సినిమాలో నటించినా.. దానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ వచ్చినా హాట్  టాపిక్‌గా మారుతోంది. తాజాగా నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా(Thank You Movie)కు సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం లో రాశి ఖన్నా(Raashi Khanna), అవికా గోర్, మాళవిక నెయిర్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.  థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూలై 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ‘నన్ను నేను సరి చేసుకోవటానికి నేను చేస్తున్న ప్రయాణమే థాంక్యూ అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు. అయితే ఈ టీజర్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.  టీజర్ ను చూసిన టాలీవుడ్ హ్యండ్సం హంక్ రానా దగ్గుబాటి(Rana Daggubati) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావు బ్రదర్, సూపర్ టీజర్ గాయ్ అంటూ చెప్పుకొచ్చారు.

అంతేకాక థాంక్యూ టీమ్ కి బెస్ట్ విషెస్ తెలిపారు రానా(Rana). ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రానా విషెస్‌పై హీరోయిన్ రాశీ ఖన్నా స్పందించింది. దీంతో రానా దగ్గుబాటికి థాంక్యూ చెప్పింది రాశీ ఖన్నా. దీనిపై పలువురు నెటిజన్లు రానాకు ప్రశ్నలు వేస్తున్నారు. నాగచైతన్య, రానా కలిసి ఎప్పుడు సినిమా తీస్తున్నారంటూ ప్రశ్నిస్తారు. అంతేకాదు. వీళ్ల సినిమాకు  ‘మనమే కదా బావా’ అంటూ టైటిల్ కూడా పెట్టేస్తున్నారు. అయితే రానా దగ్గుబాటి పెట్టిన పోస్టుపై ఓనెటిజన్ మాత్రం సందేహం వ్యక్తం చేశాడు. ‘ఇక్కడేదో తేడా కొడుతుంది.. రానా అన్న ఇన్‌టెన్షన్.. సరి అయిపోయాడు (లైఫ్)లో అని’ ఓ నెటిజన్ పోస్టు చేశాడు. మరో నెటిజన్ సామ్‌ను వదిలిన దగ్గర్నుంచి సరి అయ్యాడా అని నవ్వుతున్న ఎమోజీలు పెడుతున్నారు. మరో నెటిజన్ సామ్ మ్యాటర్‌లో సైలెంట్‌గా వేశావు.. అంటూ కామెంట్ చేశాడు. మొత్తానికి నాగచైతన్యపై రానా వేసిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

First published:

Tags: Naga Chaitanya, Rana daggubati, Samantha Ruth Prabhu

ఉత్తమ కథలు