Home /News /movies /

RANA DAGGUBATI INTERESTING COMMENTS IN VIRATAPARVAM MOVIE PRERELEASE EVENT GOES VIRAL SR

Rana Daggubati : ఇక నుంచి ఇలాంటీ సినిమాల జోలికి వెళ్లను.. ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తా : రానా

Venkatesh and Rana Photo : Twitter

Venkatesh and Rana Photo : Twitter

Rana Daggubati : విరాటపర్వం జూన్ 17, 2022న గ్రాండ్ థియేటర్లలో విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో ప్రిరిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడిన రానా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిపల్లవి  (Sai Pallavi) ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న లేటెస్ట్ చిత్రం విరాటపర్వం (Virataparvam). వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుండగా కరోనా వచ్చి రిలీజ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ అనుకున్నారని టాక్ వచ్చింది. ప్రఖ్యాత స్ట్రీమింగ్ నెట్ వర్క్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముప్పై ఐదు కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని పేర్కోంటూ (Virataparvam) ఈ సినిమా థియేటర్‌లోని విడుదలకానుందని జూలై 1న విడుదల చేస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా అధికారిక ప్రకటన ఇచ్చింది టీమ్. ఇక ఆ తర్వాత విడుదల తేది మరోసారి మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 17, 2022న గ్రాండ్ థియేటర్లలో విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో ప్రిరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా టీమ్ మొత్తం హాజరై సందడి చేశారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వెంకటేష్ వచ్చి టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

    అది అలా ఉంటే ఈ కార్యక్రమంలో మాట్లాడిన రానా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రిరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ..ఇక ఇదే చివరి సినిమా అని.. ఇక నుంచి అన్ని సినిమాలు ఫ్యాన్స్ కోసమే.. ఇక ఎటువంటీ ప్రయోగాల జోలికి పోనని తెలిపారు రానా. దీంతో రానా నిర్ణయం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందనీ చర్చించుకుంటున్నారు నెటిజన్స్.



    ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే నగాదారిలో (Nagaa daarilo) తాజాగా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ పాటను సురేష్ బొబ్బిలి కంపోజ్ చేశారు. వరం పాడారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఛలో ఛలో(Chalo Chalo) అంటూ సాగే ఈ పాటను రానా పాడారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న విరాటపర్వంలో రానా కామ్రేడ్‌ రవన్నగా కనిపించనున్నారు. మరో నటి ప్రియమణి భరతక్క అనే ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.


    విరాటపర్వం  (Viraataparvam) సినిమాలో(Rana Daggubati)  రానా, సాయి పల్లవి ,నివేతా పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్‌, నవీన్ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్‌, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విరాటపర్వం  (Viraataparvam) సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ద‌గ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సుధాక‌ర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Rana daggubati, Tollywood news, Virata Parvam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు