• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • RANA DAGGUBATI CELEBRATED HIS WIFE MIHEEKA BAJAJ BIRTHDAY IN VERITY MANNER AND GIVEN MEMORABLE GIFT PK

Rana Daggubati Miheeka: భార్య మిహీక బర్త్ డేకు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన రానా దగ్గుబాటి..

రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (Rana Daggubati Miheeka)

Rana Daggubati Miheeka: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా కొత్త జంటలున్నాయి. ఈ ఏడాది దాదాపు పాతిక జంటలు పెళ్లి చేసుకున్నారు. ఎన్నాళ్ల నుంచో సింగిల్స్‌గా ఉన్న హీరోలంతా ఈ ఏడాది నచ్చిన వాళ్లతో మింగిల్ అయిపోయారు.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా కొత్త జంటలున్నాయి. ఈ ఏడాది దాదాపు పాతిక జంటలు పెళ్లి చేసుకున్నారు. ఎన్నాళ్ల నుంచో సింగిల్స్‌గా ఉన్న హీరోలంతా ఈ ఏడాది నచ్చిన వాళ్లతో మింగిల్ అయిపోయారు. ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న పెళ్లి తర్వాత తొలి పుట్టిన రోజు జరుపుకుంది నిహారిక. భర్త చైతన్య జొన్నలగడ్డ సహా కుటుంబ సభ్యులంతా కొత్త పెళ్లి కూతురు బర్త్ డేను అంగరంగ వైభవంగా జరిపారు. మరోవైపు రానా దగ్గుబాటి భార్య మిహీక పుట్టిన రోజు కూడా ఇప్పుడే ఉంది. డిసెంబర్ 19న ఈమె పుట్టిన రోజు కావడంతో భార్య బర్త్ డే వెరైటీగా జరిపాడు రానా. పెళ్లయ్యాక తొలి పుట్టిన రోజు కావడంతో రెగ్యులర్‌గా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించాడు. గ్రాండ్ పార్టీలు గట్రా కాకుండా సింపుల్ అండ్ క్యూట్ పద్దతిలో కొట్టేసాడు దగ్గుబాటి వారసుడు. కేవలం ఆయన, భార్య మాత్రమే ఉండేలా ప్లాన్ చేసాడు. ఓ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి భార్యను తీసుకొచ్చాడు. అక్కడే కూర్చోబెట్టి ఆమెకు ఫుల్ టైమ్ ఇచ్చేసాడు రానా. పెళ్లైన దగ్గర్నుంచి కూడా బిజీగానే ఉన్నాడు ఈ హీరో. హనీమూన్ కోసం గోవా వెళ్లినా అక్కడ్నుంచి కూడా ప్రొఫెషనల్ పనులు చేసుకున్నాడు. దాంతో ఖాళీ అనే పదానికి అర్థం కూడా తెలియదు ఈయనకు. ఇప్పుడు కూడా వరస షూటింగ్స్‌తో బిజీగానే ఉన్నాడు రానా.
rana daggubati,rana daggubati birthday celebrations,daggubati rana birthday celebrations video,rana daggubati wife,rana daggubati marriage,daggubati rana birthday celebrations video at ramanaidu stuido,rana daggubati miheeka,rana daggubati celebrates wife miheeka birthday,rana daggubati celebrated miheeka bajaj birthday,రానా దగ్గుబాటి,రానా దగ్గుబాటి భార్య మిహీక బజాజ్,భార్య మిహీక బర్త్ డే సెలబ్రేట్ చేసిన రానా
రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (Rana Daggubati Miheeka)

దాంతో భార్య బర్త్ డే కోసం పూర్తిగా ఒకరోజు సెలవు తీసుకున్నాడు. అదే విషయాన్ని ఫన్నీగా చెప్పాడు రానా. పెళ్ళామ్స్ బర్త్‌డే.. మనకు హాలీడే అనే ఫన్నీ క్యాప్షన్‌తో రానా షేర్‌ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరో వైపు మిహికా కూడా తన బర్త్‌డే ఫొటోలని షేర్ చేస్తూ.. నా బలవంతం మీదే రానా హాలీడే తీసుకున్నాడు అంటూ కామెంట్ పెట్టింది. ఈ ఇద్దరి ఫోటోలు ప్రస్తుం వైరల్ అవుతున్నాయి. అన్నట్లు రానా ఇప్పుడు విరాట పర్వం సినిమాతో పాటు అరణ్య లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published: