హోమ్ /వార్తలు /సినిమా /

Rana Daggubati Miheeka Bajaj: అత్తారింట్లో కొత్తల్లుడు సందడి.. రానా దగ్గుబాటి దసరా సంబరాలు..

Rana Daggubati Miheeka Bajaj: అత్తారింట్లో కొత్తల్లుడు సందడి.. రానా దగ్గుబాటి దసరా సంబరాలు..

రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (rana daggubati miheeka bajaj)

రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (rana daggubati miheeka bajaj)

Rana Daggubati Miheeka Bajaj: రానా దగ్గుబాటి ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు. తను మెచ్చిన ప్రేయసి మిహీకా బజాజ్‌ను భార్యగా తన ఇంటికి ఆహ్వానించాడు దగ్గుబాటి వారసుడు. పెళ్ళి తర్వాత కొన్ని రోజుల వరకు ఇక్కడే ఉన్నారు రానా దంపతులు.

రానా దగ్గుబాటి ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు. తను మెచ్చిన ప్రేయసి మిహీకా బజాజ్‌ను భార్యగా తన ఇంటికి ఆహ్వానించాడు దగ్గుబాటి వారసుడు. పెళ్ళి తర్వాత కొన్ని రోజుల వరకు ఇక్కడే ఉన్నారు రానా దంపతులు. బయట పరిస్థితులు అంత బాగోలేకపోవడంతో ఇంటి పట్టునే ఉండి పూజలు పునస్కారాలు చేసుకున్నారు. ఆ తర్వాత గోవాకు హనీమూన్ కూడా వెళ్లొచ్చారు. అక్కడ్నుంచి ఫోటోలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది మిహీక. కోవిడ్ కారణంగా ఫారెన్ వెళ్లకుండా ఇండియాలోనే హనీమూన్ పూర్తి చేసారు ఈ జంట. ఇదిలా ఉంటే ఇప్పుడు అత్తారింట్లో కొత్తల్లుడు సందడి చేసాడు. పెళ్ళి తర్వాత వచ్చిన తొలి దసరా కావడంతో భార్యతోనే కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు రానా. హైదరాబాద్‌లోనే ఉన్న మిహీక ఇంటికి వెళ్లాడు రానా. అక్కడే అత్త మామలతో కలిసి కొత్తల్లుడి హోదాలో దసరా పండగను సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు రానా.

రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (rana daggubati miheeka bajaj)
రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (rana daggubati miheeka bajaj)

పర్పుల్ కలర్ శారీలో ట్రెడీషనల్ లుక్‌తో మిహీక మెరిసిపోతుంటే.. రానా మాత్రం సింపుల్‌గా వైట్ కలర్ కుర్తా వేసుకుని కూల్ లుక్‌లో దర్శనమిచ్చాడు. అత్త మామలతో కలిసి ఈ ఫోటో దిగాడు రానా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. రానా, మిహీక జంటను చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం రానా భయ్యా నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని అత్తగారింట్లో దసరాను సెలబ్రేట్ చేసుకుంటున్నావ్ కానీ మా ప్రభాస్ అన్నను మాత్రం మరిచిపోయావ్.. వదిలేసావ్ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (rana daggubati miheeka bajaj)
రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (rana daggubati miheeka bajaj)

ఎలాగోలా వచ్చే దసరాకు అయినా ప్రభాస్ అన్నను పెళ్లికి ఒప్పించవా అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం రానా అరణ్య, హిరణ్యకశ్యప, విరాట పర్వం సినిమాలతో పాటు మరో మూడు నాలుగు ప్రాజెక్టులు కూడా లైన్‌లో పెట్టాడు. పెళ్లి, కోవిడ్ సిచ్యువేషన్స్ అన్నీ ఒకేసారి వచ్చేసరికి కొన్నాళ్లుగా ఈయన ఇంటికే పరిమితం అయిపోయాడు. త్వరలోనే మళ్లీ షూటింగ్స్‌తో బిజీ కానున్నాడు రానా దగ్గుబాటి.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Miheeka Bajaj, Rana daggubati, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు