బాహుబలికి భల్లాలదేవ బర్త్‌డే విషెస్... రానా ఎమన్నాడో తెలుసా ?

'బాహుబలి' సినిమా కోసం మూడేళ్లకు పైగా ప్రభాస్, రానా కలిసి ప్రయాణించారు. బాహుబలిగా ప్రభాస్ ఎంత ఫేమస్ అయ్యాడు... భల్లాలదేవగా రానా కూడా అంతే ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

news18-telugu
Updated: October 23, 2019, 12:04 PM IST
బాహుబలికి భల్లాలదేవ బర్త్‌డే విషెస్... రానా ఎమన్నాడో తెలుసా ?
ప్రభాస్,రానా దగ్గుబాటి
news18-telugu
Updated: October 23, 2019, 12:04 PM IST
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్డ్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక తోటి నటులు సైతం ప్రభాస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ విషెస్‌తో ముంచెత్తుతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా ప్రభాస్‌కు పుట్టినరోజు వేళ ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. 'బాహుబలి' సినిమా కోసం మూడేళ్లకు పైగా ప్రభాస్ తో రానా ప్రయాణి కలిసింది. బాహుబలిగా ప్రభాస్ ఎంత ఫేమస్ అయ్యాడు... భల్లాలదేవగా రానా కూడా అంతే ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ఈ సినిమాతో వీరిద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఈ సందర్భంగా తన ఇన్ స్టాగ్రామ్‌లో ప్రభాస్‌కు విషెస్ చెప్పాడు రానా. "పుట్టిన రోజు శుభాకాంక్షలు సోదరా... నీ నవ్వు ఎప్పుడూ ఇలా నిష్కల్మషంగా ఉండాలి. లవ్ యూ" అంటూ  మెసేజ్ పెట్టాడు. ఈ క్యాప్షన్ కు ప్రభాస్ తో తాను ముచ్చటిస్తున్న ఓ ఫోటోను కూడా పోస్టు చేశాడు రానా . ఈ చిత్రంలో ప్రభాస్ మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్టు కనిపిస్తోంది. ఇక రానా పెట్టిన ఈ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...