హోమ్ /వార్తలు /సినిమా /

Rana Daggubati : సంక్రాంతి బరిలో రానా.. పండుగకు పాన్ ఇండియా సినిమాతో..

Rana Daggubati : సంక్రాంతి బరిలో రానా.. పండుగకు పాన్ ఇండియా సినిమాతో..

తెలుగు ఇండస్ట్రీలో రానా మాదిరి అన్ని పాత్రల్లో నటించే నటులు చాలా తక్కువగా ఉన్నారు. విలన్‌గా చేస్తాడు.. హీరోగా నటిస్తాడు.. అదే సమయంలో చిన్న పాత్రలో నటించమంటే అది కూడా చేస్తాడు. పదేళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు రానా ఎన్నో అద్భుతాలు చేసాడు.

తెలుగు ఇండస్ట్రీలో రానా మాదిరి అన్ని పాత్రల్లో నటించే నటులు చాలా తక్కువగా ఉన్నారు. విలన్‌గా చేస్తాడు.. హీరోగా నటిస్తాడు.. అదే సమయంలో చిన్న పాత్రలో నటించమంటే అది కూడా చేస్తాడు. పదేళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు రానా ఎన్నో అద్భుతాలు చేసాడు.

Rana Daggubati Aranya : రానా దగ్గుబాటి.. ప్యాన్ ఇండియన్ లెవల్‌లో 'హాథీ మేరే సాథీ' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

  రానా దగ్గుబాటి.. ప్యాన్ ఇండియన్ లెవల్‌లో 'హాథీ మేరే సాథీ' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇది అడవి బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.  తెలుగులో ఈ సినిమా ‘అర‌ణ్య’ పేరుతో విడుద‌ల‌వుతుంది. ప్ర‌భు సాల్మ‌న్ దర్శకత్వం వహించాడు. ఇక తాజాగా ఈ సినిమా 2021 సంక్రాంతికి విడుద‌ల‌వుతుంద‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. తాజాగా విడుదలైన ఈ మోషన్ పోస్టర్ ను గమనిస్తే పెరిగిన గ‌డ్డంతో రానా అడ‌వి మ‌నిషిలాగే క‌నిపిస్తుండ‌గా, విష్ణు విశాల్ తీక్ష‌ణ‌మైన చూపుల‌తో ఉన్నాడు. ఓ 25 సంవ‌త్స‌రాలుగా అర‌ణ్యంలో జీవిస్తున్న ఒక మ‌నిషి క‌థ ‘అరణ్య‌ ’ అని.. ఈ చిత్రం ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌లు, అట‌వీ నిర్మూల‌న సంక్షోభం వంటి అంశాలను చర్చించనుందట. ఈ చిత్రంలో జోయా హుస్సేన్‌, శ్రియ పిల్గావోంక‌ర్ మ‌రో రెండు కీల‌క పాత్ర‌లు పోషించారు. శంత‌ను మొయిత్రా సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన అర‌ణ్య టీజ‌ర్‌కు అన్ని చోట్లా మంచి రెస్పాన్స్  దక్కించుకుంది.

  రానా మరో సినిమా విరాట పర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్‌లో రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సాయి పల్లవి మరో కీలకపాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో మొదలవుతుంది. దీని తర్వాత మిలింద్ దర్శకత్వంలో రూపొందే చిత్రం చేస్తాడు రానా. ఈ సినిమాలతోపాటు రానా గుణశేఖర్‌ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప' అనే ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం 'హిరణ్యకశ్యప' ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌లో ఉంది. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.

  రానా దగ్గుబాటి తాజాగా ఓ హిందీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'గృహం' ఫేమ్‌ డైరెక్టర్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రానా హీరోగా నటించనున్నాడు. మిలింద్ చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయిన రానా వెంటనే ఓకే చెప్పేశాడట. మంత్ర తంత్రాలు.. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కించనుంది చిత్రబృందం. దీంతో ఈ సినిమాలో గ్రాఫిక్స్‌ను విపరీతంగా వాడనున్నారట. అందులో భాగంగా వీఎఫ్ఎక్స్ కు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మాత సురేష్ బాబు, గోపీనాథ్ ఆచంట కలసి సంయుక్తంగా భారీ బడ్జెట్టుతో నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్‌ల్లో విడుదలకానుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Rana, Tollywood news

  ఉత్తమ కథలు