రానా ‘అరణ్య’ టీజర్‌ టాక్.. అడివి మనిషిగా భళ్లాల దేవుడు భళా..

Aranya Teaser Talk | తాజాగా రానా.. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘అరణ్య’ అనే త్రిభాషా చిత్రం చేస్తున్నాడు. హిందీలో ‘హాథీ మేరా సాథీ’ పేరుతో విడుదల కానుంది. తమిళంలో ‘కాదన్’ పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే హిందీ, తమిళ టీజర్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ‘అరణ్య’ టీజర్‌ విడుదల చేసారు.

news18-telugu
Updated: February 14, 2020, 5:33 PM IST
రానా ‘అరణ్య’ టీజర్‌ టాక్.. అడివి మనిషిగా భళ్లాల దేవుడు భళా..
రానా ‘అరణ్య’ టీజర్ టాక్ (Twitter/Photo)
  • Share this:
Aranya | బాహుబలి సినిమాతో హీరోగా ప్రభాస్ క్రేజ్‌తో పాటు ప్రతినాయకుడు భళ్లాల దేవునిగా నటించిన రానాకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రానా తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. తాజాగా రానా.. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘అరణ్య’ అనే త్రిభాషా చిత్రం చేస్తున్నాడు. హిందీలో ‘హాథీ మేరా సాథీ’ పేరుతో విడుదల కానుంది. తమిళంలో ‘కాదన్’ పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే హిందీ, తమిళ టీజర్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ‘అరణ్య’ టీజర్‌ విడుదల చేసారు. ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రానా  అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగకి చెందిన వ్యక్తిగా నటిస్తున్నాడు. ఇందులో అడివి మనిసిగా ‘అరణ్య’గా  రానా లుక్ అదిరిపోయింది.  మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది. ఈ సినిమాలో జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్ , విష్ణు విశాల్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు.  ఈచిత్రాన్ని అన్ని భాషల్లో ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు.

రానా ప్రస్తుతం ‘అరణ్య’ సినిమాతో పాటు నక్సల్ బ్యాక్ గ్రౌండ్‌లో తెరకెక్కుతున్న 'విరాట పర్వం'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘నీది నాది ఒకే కథ' అనే సినిమాకు దర్శకత్వం వహించిన వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. రానా ప్రధాన పాత్రలో పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోంది. సినిమా ప్రధానంగా పొలిటికల్‌ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రానా పాత్ర పాజిటివ్ ఆటీట్యూడ్‌తో పాటు కొంత నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటుందని అదే ఈ సినిమాలో కొత్తగా ఉండనుందని సమాచారం. మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథే ఈ విరాట పర్వం. దీనికి తోడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ న్యూ యాంగిల్ లో దర్శకుడు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిస్తున్నారు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయని పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలో భక్త ప్రహ్లాదుడి స్టోరీతో ‘హిరణ్య కశ్యప’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు