వరుణ్‌ తేజ్‌ను మోసం చేసిన రానా, నితిన్.. కారణం ఇదే..

హీరో వరుణ్ తేజ్‌కు రానా దగ్గుబాటి, నితిన్‌ను మోసం చేసారంటూ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

news18-telugu
Updated: May 23, 2020, 6:21 PM IST
వరుణ్‌ తేజ్‌ను మోసం చేసిన రానా, నితిన్.. కారణం ఇదే..
వరుణ్ తేజ్, రానా, నితిన్ (Twitter/Photo)
  • Share this:
హీరో వరుణ్ తేజ్‌కు రానా దగ్గుబాటి, నితిన్‌ను మోసం చేసారంటూ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. తాజాగా మెగా హీరోలైన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌ల మధ్య సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. రీసెంట్‌గా నాగబాబు ట్విట్టర్ వేదికగా వరుణ్ తేజ్, నిహారిక పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వీడియోను సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేస్తూ.. ఏంటి బావ నీకు పెళ్లంట.. ? అంటూ సాయి ధరమ్ తేజ్..వరుణ్ తేజ్‌ను అడిగాడు. దీనికి వరుణ్ తేజ్ బదులిస్తూ.. నా పెళ్లికి చాలా సమయమే ఉంది. ఐతే.. రానా, నితిన్ మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదు. మేమెపుడు సింగ్ గ్రూపే అని చెప్పి, బ్యాచిలర్ గ్రూప్ నుండి బయటకు వెళ్లిపోయి తనను మోసం చేశారని కాస్త ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు.


వరుణ్ ట్వీట్‌కు మంచు లక్ష్మి అది నిజమే అంటూ మద్దుతు తెలిపింది. ఇక రానా విషయానికొస్తే.. ఉన్నట్టుండి తనకు కాబోయే భార్య ఈమె అంటూ మిహీకా బజాక్‌తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. తాజాగా రానా ఇంట్లో వీళ్లిద్దరికి సంబందించి ఎంగేజ్మెంట్ తరహాలో ‘రోకా’ అంటూ ఓ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు వీరి పెళ్లి విషయమై మాట్లాడుకున్నారు. డిసెంబర్‌లో రానా , మిహీకాల వివాహాం జరగనున్నట్టు రానా తండ్రి సురేష్ బాబు తెలిపారు. ఇక నితిన్ విషయానికొస్తే.. తన ప్రేయసి షాలినీతో నిశ్చితార్ధం జరిగింది. ఏప్రిల్‌లో వీరి పెళ్లి దుబాయిలో జరగాల్సి ఉండగా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే వీరి పెళ్లి డేట్ పై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading