హోమ్ /వార్తలు /సినిమా /

Rana-Miheeka: రానా ఎఫైర్స్ పై స్పందించిన మిహిక.. ఇంతకీ ఏమన్నదంటే..

Rana-Miheeka: రానా ఎఫైర్స్ పై స్పందించిన మిహిక.. ఇంతకీ ఏమన్నదంటే..

రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (rana daggubati miheeka bajaj marriage)

రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (rana daggubati miheeka bajaj marriage)

Rana Daggaubati-Miheeka | నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న.. తన గర్ల్ ఫ్రెండ్ మిహిక బజాజ్‌ను పెద్దల సమక్షంలోపెళ్లి చేసుకున్నాడు.తన పై వచ్చిన ఎన్నో రూమర్స్‌కు మిహిక ఎలా స్పందించిందో తాజాగా మీడియాకు తెలిపాడు రానా.

ఇంకా చదవండి ...

    Rana Daggaubati-Miheeka | నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న.. తన గర్ల్ ఫ్రెండ్ మిహిక బజాజ్‌ను పెద్దల సమక్షంలోపెళ్లి చేసుకున్నాడు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కొద్ది మంది సమక్షంలో వీరి వివాహాం ఎంతో ఘనంగా జరిగింది. మ్యారేజ్ తర్వాత రీసెంట్‌గా మీడియా ముందుకు వచ్చిన రానా దగ్గుబాటి కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చాడు. మీడియాలో తన ఎఫైర్స్‌కు గురించి మీడియాలో వచ్చిన వార్తలపై మిహిక ఎలా స్పందించిందో తెలియజేసాడు.  నాపై మీడియాలో రకరకాలు రూమర్స్ వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలో నా పై వచ్చినన్ని రూమర్స్ ఈ మధ్య కాలంలో ఎవరిపై రాలేదు. అవి అందరికీ తెలిసినవే. మిహికాకు కూడా నా పై వచ్చిన రూమర్స్ గురించి తెలుసు. ఆమె ముంబైతో పాటు హైదరాబాద్‌లో ఎక్కువగా ఉంది. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ పై ఆమెకు పూర్తి అవగాహన ఉంది. ఇప్పటి జనరేషన్ యూత్‌కు ఇలాంటి విషయాలపై క్లారిటీ వుంది. నాపై వచ్చిన గాసిప్‌ల విషయంలో మిహిక ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు. ఎఫైర్స్ గురించే కాదు.. నా హెల్త్ విషయంలో మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. వాటి గురించి కూడా మిహిక పెద్దగా పట్టించుకోలేదని రానా చెప్పుకొచ్చాడు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Miheeka Bajaj, Rana daggubati, Tollywood

    ఉత్తమ కథలు