• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • RANA DAGGUBATI ABOUT HIS LIFE AFTER MARRIAGE WITH MIHEEKA BAJAJ HERE IS DETAILS MNJ

Rana-Miheeka: మిహీక వ‌చ్చాక న‌న్ను అలా మార్చింది.. భార్యపై రానా కీల‌క వ్యాఖ్య‌లు

రానా దగ్గుబాటి మిహీక బజాజ్ (rana daggubati miheeka bajaj marriage)

Rana daggubati- Miheeka Bajaj: వైవిధ్య నటుడు రానా ద‌గ్గుబాటి గ‌తేడాది ఆగ‌ష్టులో మిహీక‌ను వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. మే నెల‌లో మిహీక త‌న ప్రేమ‌ను ఒప్పుకుంద‌న్న విషయాన్ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించిన రానా.. ఆగష్టులో ఆమె మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. క‌

  • Share this:
    Rana daggubati- Miheeka Bajaj: వైవిధ్య నటుడు రానా ద‌గ్గుబాటి గ‌తేడాది ఆగ‌ష్టులో మిహీక‌ను వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. మే నెల‌లో మిహీక త‌న ప్రేమ‌ను ఒప్పుకుంద‌న్న విషయాన్ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించిన రానా.. ఆగష్టులో ఆమె మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. క‌రోనా నేప‌థ్యంలో అత్యంత స‌న్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజ‌ర‌య్యారు. కాగా మిహీక ఇంటీరియ‌ర్ డెక‌రేటర్. అలాగే ఆమెకు ఈవెంట్ బిజినెస్‌ని న‌డుపుతున్నారు. ఇదిలా ఉంటే రానా ప్ర‌స్తుతం అర‌ణ్య ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్నారు. మార్చి 26న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.. ఆ మూవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ఇంట‌ర్వ్యూలో త‌న భార్య మిహీక గురించి రానా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

    మిహీక‌తో త‌న పెళ్లి త‌రువాత త‌న జీవితం పాజిటివ్‌గా మారింద‌ని ఆయ‌న అన్నారు. మ్యారేజ్ జీవితం త‌రువాత వ‌ర్క్‌లో బ్యాలెన్స్ చేసుకోవ‌డం తెలిసింది. నా సినిమా వ‌ర్క్‌ని ఇప్పుడు నేను ఇంటివ‌ర‌కు తీసుకెళ్ల‌డం లేదు అని రానా తెలిపారు. ఇక మిహీక‌ను పెళ్లి చేసుకుంటాన‌ని ఇంట్లో చెప్పిన స‌మ‌యంలో అంద‌రూ పాజిటివ్‌గానే స్పందించార‌ని ఆ మ‌ధ్య‌న ఓ ఇంట‌ర్వ్యూలో రానా అన్నారు. పెళ్లి చేసుకొని సెటిల్ అవుతాన‌ని వాళ్లు సంతోష‌ప‌డ్డార‌ని గుర్తు చేసుకున్నారు. ఇక నాగ చైత‌న్య అయితే ఇది నువ్వు తీసుకున్న గొప్ప నిర్ణ‌యంరా అంటూ సంతోషాన్ని వ్య‌క్తం చేశాడ‌ని రానా చెప్పుకొచ్చారు.

    కాగా మ‌రోవైపు రానా హోస్ట్‌గా చేస్తోన్న నంబ‌ర్ 1 యారీ మూడో సీజ‌న్ ప్రారంభం అయ్యింది. ఆహాలో ఈ షో వ‌స్తుండ‌గా.. మొద‌టి ఎపిసోడ్‌లో న‌వీన్ పొలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి, నాగ్ అశ్విన్‌లు పాల్గొన్నారు. ఈ షోలో చాలా వీరు సంద‌డి చేశారు. ఇక ఈ సీజ‌న్‌లోనూ ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.
    Published by:Manjula S
    First published: