Ramya Krishnan : అపురూపమైన సీమంతం ఫోటోలను పంచుకున్న రమ్యకృష్ణ..

Ramya Krishnan : రమ్యకృష్ణ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో గడుపుతోంది.

news18-telugu
Updated: July 23, 2020, 3:05 PM IST
Ramya Krishnan : అపురూపమైన సీమంతం ఫోటోలను పంచుకున్న రమ్యకృష్ణ..
సీమంత వేడుకలో శివగామి Photo ; Twitter
  • Share this:
Ramya Krishnan : నీలాంబరిగా మారినా.. శివగామిగా రాజ్యాన్ని పాలించినా.. దేవతగా అవతారం ఎత్తినా.. రమ్యకృష్ణకే చెల్లింది. 1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఓ వెలుగు వెలిగింది రమ్యకృష్ణ. కే.రాఘవేంద్రరావు చిత్రాలకు కేరాఫ్ రమ్యకృష్ణ అనేంతగా ఆయన దర్శకత్వంలో సూపర్‌హిట్ సినిమాలు చేసింది. ఆ సమయంలో కుర్రకారుకు రమ్యకృష్ణ స్వప్న సుందరి. తన హాట్ అందాలతో ఓ ఊపు ఊపేసింది తెలుగు వారిని. ఆ తర్వాత తల్లి, వదిన.. పలు పాత్రల్లో నటించినా, బాహుబలి చిత్రాల్లో ‘శివగామి’ పాత్ర ఆమె నటనా కౌశలాన్ని ఖండాంతరాలకు విస్తరింపజేసింది. అది అలా ఉంటే రమ్యకృష్ణ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో గడుపుతోంది. సమయం ఎక్కువుగా ఉన్నందున.. సినీనటులు తమ పాత కాలపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది.


అందులో భాగంగా తాజాగా రమ్యకృష్ణ తన ట్విట్టర్‌ ఖాతాలో తనకు అపురూమైన రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. అవి తన సీమంతం వేడుకకి సంబంధించిన ఫొటోలని పేర్కోంది. తన సీమంత వేడుకకు.. ఇద్దరు పెద్దమ్మలు వచ్చి తనను ఆశీర్వదించారని పేర్కోంటూ.. వారు ఇప్పుడు లేరని మరణించారని తెలిపింది. ఆ ఫోటల్లో గంధం పూసుకుని రమ్యకృష్ణ ఉండగా.. తన పెద్దమ్మలు గాజులు వేస్తున్నారు. ఈ సీమంత వేడుకలో తన తల్లి ఫోటోలను తీసిందని అప్పుటి గుర్తుల్నీ తన అభిమానులతో పంచుకుంది శివగామి. ఇక 2003లో రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణ వంశీల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సెలెబ్రిటీ జంటకు ఓ కుమారుడు.


ఇక రమ్యకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం తన భర్త దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తోంది. ఈ సినిమా నట సామ్రాట్ అనే ఓ మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. రమ్యకృష్ణ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన క్విన్ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ నటించి.. అదరగొట్టింది. వీటితో పాటు రమ్యకృష్ణ పలు షోలకు వ్యాఖ్యాతగాను, కొన్ని సిరీయల్స్‌లో కూడా నటిస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: July 23, 2020, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading