ఈ ఫోటోను చూస్తుంటే ఇంతకంటే గొప్పగా ఏమనిపిస్తుంది మరి. అప్పట్లో ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఈ ఇద్దరూ దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో వెంకటేష్ కూడా ఉన్నాడు.
ఈ ఫోటోను చూస్తుంటే ఇంతకంటే గొప్పగా ఏమనిపిస్తుంది మరి. అప్పట్లో ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఈ ఇద్దరూ దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో వెంకటేష్ కూడా ఉన్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఈ రోజు రమ్యకృష్ణ కెరీర్ ఇంత స్ట్రాంగ్‌గా ఉందంటే దానికి కారణం రాఘవేంద్రరావు. దర్శకేంద్రుడి చలువతోనే ఈమె స్టార్ హీరోయిన్ అయింది. 80ల చివర్లో ఇండస్ట్రీకి వచ్చింది రమ్యకృష్ణ. ఈమె నటించిన సినిమాలు మొదట్లో వరసగా ఫ్లాప్ అవుతుంటే ఐరెన్ లెగ్ అంటూ డిసైడ్ చేసారు నిర్మాతలు. అలాంటి సమయంలో ఆమెను తన సినిమాలో తీసుకుని స్టార్‌గా మార్చేసాడు దర్శకేంద్రుడు. అదే అల్లుడు గారు.. ఈ చిత్రం తర్వాత ఈ కాంబినేషన్లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. తన కెరీర్ గురించి చెప్పినపుడు దర్శకేంద్రుడి గురించి చాలా గొప్పగా చెప్తుంటుంది రమ్యకృష్ణ. ఇక ఇప్పుడు ఈ ఫోటో కూడా అప్పట్లో వెంకటేష్ హీరోగా వచ్చిన ముద్దుల ప్రియుడు సినిమాలోనిది. మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ సినిమా సెట్లో ఓ పాట గురించి వెంకీ, రమ్యకు వివరిస్తూ ఇచ్చిన పోజ్ ఇది. ఏదేమైనా కూడా అప్పట్లో ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు నిజంగా గోల్డే కదా..!
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.