Ramya Krishna: షూటింగ్ మొదలు పెట్టిన రమ్యకృష్ణ..

Ramya Krishna: చాలా చాలా రోజుల తర్వాత మళ్లీ మొహానికి మేకప్ వేసుకుంది శివగామి రమ్యకృష్ణ. దాదాపు నాలుగు నెలల తర్వాత ఈమె మళ్లీ కెమెరా ముందుకొచ్చింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 20, 2020, 5:13 PM IST
Ramya Krishna: షూటింగ్ మొదలు పెట్టిన రమ్యకృష్ణ..
Ramya Krishna: చాలా చాలా రోజుల తర్వాత మళ్లీ మొహానికి మేకప్ వేసుకుంది శివగామి రమ్యకృష్ణ. దాదాపు నాలుగు నెలల తర్వాత ఈమె మళ్లీ కెమెరా ముందుకొచ్చింది.
  • Share this:
చాలా చాలా రోజుల తర్వాత మళ్లీ మొహానికి మేకప్ వేసుకుంది శివగామి రమ్యకృష్ణ. దాదాపు నాలుగు నెలల తర్వాత ఈమె మళ్లీ కెమెరా ముందుకొచ్చింది. ఇదే విషయాన్ని ట్వీట్ చేసింది ఈ సీనియర్ హీరోయిన్. కరోనా కారణంగా 150 రోజులకు పైగా షూటింగ్స్ లేవు.. అంతా ఆపేసి ఇంటికే పరిమితం అయిపోయారు. బయటికి వస్తే కచ్చితంగా కరోనా అటాక్ చేస్తుంది. అందుకే అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. రమ్యకృష్ణ కూడా చాలా రోజులు ఇంట్లో కూర్చుని ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకొచ్చింది.
రమ్యకృష్ణ (ramya krishna)
రమ్యకృష్ణ (ramya krishna)


తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రాదని.. దాన్ని నియంత్రించ వచ్చని అంతా చెప్తుండటంతో.. అవన్నీ ఫాలో అవుతూ కరోనాకు దూరంగా షూటింగ్‌కు దగ్గరగా వచ్చేసింది రమ్య. తాజాగా షాట్‌కు రెడీ అవుతూ.. మేకప్ వేసుకుంటున్న ఫోటోను ట్వీట్ చేసింది ఈమె. అందులో తమన మేకప్ మెన్ కూడా పక్కనే ఉన్నాడు.. స్వయంగా రమ్యకృష్ణ తన మేకప్ తనే వేసుకుంటుంది. సినిమా ఏది అనేది తెలియదు కానీ ప్రస్తుతం రమ్యకృష్ణ మాత్రం షూటింగ్స్‌తో బిజీగా మారిపోయింది.

చిన్నపుడు సమ్మర్ హాలీడేస్ అయిపోయిన తర్వాత స్కూల్‌కు వెళ్లేటప్పుడు పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది.. ఇప్పుడు తనకు కూడా అలాగే ఉందని ట్వీట్ చేసింది రమ్యకృష్ణ. ఇప్పటికే రోజా లాంటి సీనియర్ హీరోయిన్స్ కూడా జబర్దస్త్ లాంటి కార్యక్రమాలతో బిజీ అయిపోయారు. ఇప్పుడు రమ్య కూడా ఇదే చేస్తుంది.
రమ్యకృష్ణ (ramya krishna)
రమ్యకృష్ణ (ramya krishna)

కరోనాకు భయపడి ఇంకా ఎంత కాలం బయటికి రాకుండా ఉంటాం.. అలాగే ఉండిపోలేం కదా.. మన పని మనం చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది ఈ సీనియర్ హీరోయిన్. మరి అంతేకదా.. కరోనాకు భయపడి ఇంట్లోనే కూర్చుంటే ఇళ్లు ఎలా గడుస్తుంది.. అందుకే నా మాటే శాసనం అంటూ బయల్దేరింది రమ్యకృష్ణ.
Published by: Praveen Kumar Vadla
First published: August 20, 2020, 5:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading