రాఘవేంద్రరావుతో రమ్యకృష్ణ.. వైరల్ అవుతున్న అరుదైన ఫోటో..

Ramya Krishna: ఈ ఫోటోను చూస్తుంటే ఇంతకంటే గొప్పగా ఏమనిపిస్తుంది మరి. అప్పట్లో ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా ఈ ఇద్దరూ దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 27, 2020, 4:33 PM IST
రాఘవేంద్రరావుతో రమ్యకృష్ణ.. వైరల్ అవుతున్న అరుదైన ఫోటో..
రాఘవేంద్రరావు రమ్యకృష్ణ రేర్ ఫోటో (ramya krishna raghavendra rao)
  • Share this:
ఈ ఫోటోను చూస్తుంటే ఇంతకంటే గొప్పగా ఏమనిపిస్తుంది మరి. అప్పట్లో ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా ఈ ఇద్దరూ దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో వెంకటేష్ కూడా ఉన్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఈ రోజు రమ్యకృష్ణ కెరీర్ ఇంత స్ట్రాంగ్‌గా ఉందంటే దానికి కారణం రాఘవేంద్రరావు. దర్శకేంద్రుడి చలువతోనే ఈమె స్టార్ హీరోయిన్ అయింది. 80ల చివర్లో ఇండస్ట్రీకి వచ్చింది రమ్యకృష్ణ. ఈమె నటించిన సినిమాలు మొదట్లో వరసగా ఫ్లాప్ అవుతుంటే ఐరెన్ లెగ్ అంటూ డిసైడ్ చేసారు నిర్మాతలు. అలాంటి సమయంలో ఆమెను తన సినిమాలో తీసుకుని స్టార్‌గా మార్చేసాడు దర్శకేంద్రుడు.

రమ్యకృష్ణ రేర్ ఫోటో (ramya krishna raghavendra rao)
రమ్యకృష్ణ రేర్ ఫోటో (ramya krishna raghavendra rao)


అదే అల్లుడు గారు.. ఈ చిత్రం తర్వాత ఈ కాంబినేషన్‌లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. తన కెరీర్ గురించి చెప్పినపుడు దర్శకేంద్రుడి గురించి చాలా గొప్పగా చెప్తుంటుంది రమ్యకృష్ణ. ఇక ఇప్పుడు ఈ ఫోటో కూడా అప్పట్లో వెంకటేష్ హీరోగా వచ్చిన ముద్దుల ప్రియుడు సినిమాలోనిది. మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ సినిమా సెట్‌లో ఓ పాట గురించి వెంకీ, రమ్యకు వివరిస్తూ ఇచ్చిన పోజ్ ఇది. ఏదేమైనా కూడా అప్పట్లో ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు నిజంగా గోల్డే కదా..!
Published by: Praveen Kumar Vadla
First published: April 27, 2020, 4:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading