జయ లలితగా రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల..

ఓ సినీ నటిగా, పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటికే జయలలిత పాత్రలో ఉన్న రమ్యకృష్ణను లుక్‌ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు ‘క్వీన్’ అనే టైటిల్ ఖరారు చేసారు.

news18-telugu
Updated: September 7, 2019, 7:22 PM IST
జయ లలితగా రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల..
‘క్వీన్’టైటిల్‌తో తెరకెక్కుతోన్న జయలలిత వెబ్ సిరీస్
  • Share this:
ఓ సినీ నటిగా, పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు.  2016లో అనారోగ్య కారణాలతో కన్నుమూసారు. ఆమె మరణం కూడా ఒక మిస్టరీయే. అందుకే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అవుతున్నారు. ఇప్పటికే నిత్యామీనన్..జయలలితగా ‘ది ఐరన్ లేడీ’ అనే సినిమా తెరకెక్కతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు కంగనా హీరోయిన్‌గా ‘తలైవి’ సినిమా చేస్తోంది. మరోవైపు విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఒక బయోపిక్ తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.

జయలలితగా రమ్యకృష్ణ లుక్ అదుర్స్..నాలుగు భాషల్లో రానున్న ‘అమ్మ’ జీవితం, Ramya Krishna As Jayalalitha In Gautham Meenon Web Series
జయ లలితగా రమ్యకృష్ణ


తాజాగా అమ్మ జయలలిత జీవితంపై వెబ్ సిరీస్ ‌కూడా రూపొందుతోంది.గౌతమ్ మీనర్ డైరెక్ట్ చేస్తోన్నఈ వెబ్ సిరీస్‌లో జయలలితగా రమ్యకృష్ణగా నటిస్తోంది.  జయలలిత పాత్రలో ఉన్న రమ్యకృష్ణను లుక్‌ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు ‘క్వీన్’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్స్‌గా రాబోతుంది. తొలి సీజన్ 10 భాగాలుగా ప్రేక్షకుల ముందు రానుంది. దీనికి వచ్చే రెస్పాన్స్ వచ్చి.. రెండో సీజన్‌ను తెరకెక్కిస్తారట. ఈ వెబ్ సిరీస్‌ను ఒకేసారి తమిళంతో పాటు తెలుగు, హిందీలో తెరకెక్కించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను మురుగేశన్ అనే దర్శకుడితో కలిసి గౌతమ్ మీనన్ డైరెక్ట్  చేయనున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 7, 2019, 7:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading