Ramya Krishna - Krishna Vamsi: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా రమ్యకృష్ణకు ప్రత్యేక స్థానం ఉంది. మరోవైపు దర్శకుడిగా కృష్ణ వంశీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక దర్శకుడిగా కృష్ణ వంశీ డైరెక్టర్‌గా కాక ముందే రమ్యకృష్ణ ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్. ఇక దర్శకుడి కృష్ణవంశీ తెరకెక్కించిన ‘గులాబి’ సినిమాలో చక్రవర్తి, మహేశ్వరిలపై చిత్రీకరించిన బైక్ సాంగ్.. మేఘాలలో సాగిపోమ్మనది సాంగ్ ఎంతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే కదా. ఈ సినిమాతో కృష్ణవంశీ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. అప్పట్లో రమ్యకృష్ణ ఈ బైక్ సాంగ్ చూసి ఫిదా అయిందట. అంతేకాదు తెలుగులో ఇలాంటి పాట వచ్చిందా అని ఆశ్యర్యపోయిందట. అంతేకాదు ఈ సినిమా తర్వాత ఏకంగా నాగార్జున హీరోగా.. ’నిన్నేపెళ్లాడతా’ సినిమాను తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నారు. కానీ కృష్ణవంశీ మొదటిసారి రమ్యకృష్ణను డైరెక్ట్ చేసింది నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘చంద్రలేఖ’ సినిమా. ఈ సినిమాలో రమ్యకృష్ణ టైటిల్ రోల్ చంద్ర పాత్రను పోషించింది.
ఈ సినిమా కంటే ముందు రమ్యకృష్ణను కృష్ణవంశీకి పరిచయం చేసింది మాత్రం బ్రహ్మానందం అట. ఇక రమ్యకృష్ణను కృష్ణవంశీకి తొలిసారి పరిచయం చేసింది మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ‘అదిరింది అల్లుడు’ సినిమా సెట్లోనట. అప్పటి ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ తర్వాత వీళ్లిద్దరు తరుచుగా కలుసుకునే వారట. అలా ఆరేళ్లు గడిచిపోయాయట.
ఆ తర్వాత ఒకరికొకరు అర్ధం చేసుకొని 2003లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు రిత్విక్ కృష్ణ అనే బాబు ఉన్నారు. ఇద్దరు పేరులో కామన్‌గా ఉన్న కృష్ణ పేరును కుమారుడికి పెట్టడం విశేషం. పెళ్లి తర్వాత రమ్యకృష్ణ.. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీఆంజనేయం’లో హీరో తల్లి పాత్రలో నటించారు. ఇపుడు మరోసారి ‘రంగమార్తాండ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. దాదాపు 26 యేళ్ల కెరీర్లో 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో హిందీ చిత్రం ‘శక్తి’ కూడా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brahmanandam, Krishna vamsi, Ramya Krishna, Telugu Cinema, Tollywood