హోమ్ /వార్తలు /సినిమా /

కే.ఏ.పాల్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

కే.ఏ.పాల్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

రాంగోపాల్ వర్మ,  కేఏ పాల్ (ఫైల్ ఫొటోలు)

రాంగోపాల్ వర్మ, కేఏ పాల్ (ఫైల్ ఫొటోలు)

ఎవరినైనా గిల్లాలన్నా..రెచ్చగొట్టాలన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. ఎపుడు ఎవరినీ ఎలా కెలుకుతాడో ఎవ్వరికీ ఎప్పటికీ అర్థం కాదు. తాజాగా క్రైస్తవ మత ప్రచారకుడు ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్‌పై ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

ఎవరినైనా గిల్లాలన్నా..రెచ్చగొట్టాలన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. ఎపుడు ఎవరినీ ఎలా కెలుకుతాడో ఎవ్వరికీ ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ విషయమై బాలకృష్ణతో పాటు చంద్రబాబును టార్గెట్ చేసిన వర్మ..తాజాగా క్రైస్తవ మత ప్రచారకుడు ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్‌పై ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనం సృష్టిస్తున్నాయి.


వివరాల్లోకి వెళితే రామ్ గోపాల్ వర్మ..ప్రజా శాంతి వ్యవస్థాపకుడైన కేఏ పాల్‌ను శిలువ వేయబోతున్నానని జీసస్ క్రైస్ట్ తనకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడంటూ ట్వీట్ చేసాడు. గత కొన్నేళ్లుగా ఆర్జీవీ, కేఏ పాల్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మోడీ, చంద్రబాబు వంటి చిన్న నేతలపై పోటీ చేసేకంటే జీసస్‌ను ఓ ప్రపంచాన్ని సృష్టించమని కోరి దానికి కే.ఏ.పాల్ అధ్యక్షడు కావచ్చుగా అని వర్మ సెటైర్లు వేసాడు. దానికి సమాధానంగా ముంబైలో ఉన్న ఓ హోటల్‌లో వర్మ తన పాదాలకు పాదాభివందనం చేసినట్టు పాల్ వ్యాఖ్యానించాడు.


దానికి కౌంటర్‌గా వర్మ ..ఓ ప్రభువా నేను పాల్ కాళ్లను ముట్టుకోలేదు. జస్ట్ పట్టుకొని వెనక్కి లాగాను. తల నేలకు కొట్టుకుంటే బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డాను. కానీ మీరు హర్ట్ అవుతారేమేనని వదిలేశా అంటూ కొంటే సమాధానమిచ్చాడు. ఏమైనా రామ్ గోపాల్ వర్మ..కేఏ పాల్‌పై చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.


‘యాత్ర’ విడుదల వేడుకలు 
ఇవి కూడా చదవండి


Yatra Movie Review : ‘యాత్ర’ మూవీ రివ్యూ..ఎమోషనల్ జర్నీ ఆఫ్ వైయస్ఆర్


KGF‌ కోసం రంగంలోకి దిగుతున్న శంకర్ దాదా


ఒకే రోజు వస్తోన్న ఇద్దరు మాజీ సీఎంలు..యాత్ర Vs ఎన్టీఆర్ కథానాయకుడు

First published:

Tags: Ka paul, Ram Gopal Varma, RGV, Telugu Cinema, Tollywood news

ఉత్తమ కథలు