హోమ్ /వార్తలు /సినిమా /

డియర్ కామ్రేడ్-ఇస్మార్ట్ శంకర్ మధ్య చిచ్చుపెట్టిన రాంగోపాల్ వర్మ

డియర్ కామ్రేడ్-ఇస్మార్ట్ శంకర్ మధ్య చిచ్చుపెట్టిన రాంగోపాల్ వర్మ

రాంగోపాల్ వర్మ

రాంగోపాల్ వర్మ

డియర్ కామ్రేడ్‌ను ఇస్మార్ట్ శంకర్‌తో పోలుస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. రెండు సినిమాల కలెక్షన్ వివరాలను అందులో పోస్ట్ చేశారు.

డియర్ కామ్రేడ్.. ఇస్మార్ట్ శంకర్.. ఇటీవల విడుదలైన రెండు తెలుగు సినిమాలు.ఒకటి పక్కా క్లాస్ అయితే.. మరొకటి పక్కా ఊరమాస్.. డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్‌గా పెర్ఫామ్ చేస్తుండగా.. ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పూరికి ఈ సినిమాతో ఆ దాహం తీరిపోయింది. నిజానికి ఇస్మార్ట్ శంకర్‌కు ఇంత పెద్ద విజయం దక్కుతుందని తాను కూడా ఊహించలేకపోయానని స్వయంగా పూరినే చెప్పాడు. పూరి విజయాన్ని ఆయన గురువు, దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. హైదరాబాద్‌ మూపాపేటలోని శ్రీరాములు థియేటర్‌లో ఇస్మార్ట్ శంకర్ సినిమా చూడటానికి వెళ్లి.. ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

సరే ఇదంతా పక్కనపెడితే.. తాజాగా ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. డియర్ కామ్రేడ్‌ను ఇస్మార్ట్ శంకర్‌తో పోలుస్తూ ఆయనో ట్వీట్ చేశారు.'ఇస్మార్ట్ శంకర్ నాన్‌ఇస్మార్ట్ కామ్రేడ్ కంటే ఇస్మార్ట్‌గా ఉందా.. లేక.. నాన్‌ఇస్మార్ట్ కామ్రేడ్ ఇస్మార్ట్ శంకర్‌ను మించిపోయిందా?.. నిజం రామ్ విజయానికి తెలుసు.' అంటూ ఇన్‌డైరెక్టర్‌గా హీరో విజయ్ దేవరకొండపై సెటైర్ వేశాడు. అంతేకాదు, ఆయా థియేటర్లలో ఈ రెండు సినిమాల కలెక్షన్ల వివరాలు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్‌పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అదేదో డైరెక్ట్‌గా ఇస్మార్ట్ శంకర్‌నే పొగడొచ్చు కదా.. ఇంత ముసుగులో గుద్దులాట ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.

First published:

Tags: Dear Comrade, Hero ram, Ismart Shankar, Ramgopal varma, Vijay Devarakonda

ఉత్తమ కథలు