రవితేజ తాజా సినిమా డిస్కోరాజా ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్తో అలరిస్తోంది. ఈ సినిమాకు వి.ఐ.ఆనంద్ దర్శకుడు. అది అలా ఉంటే ఈరోజు రవితేజ తన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్స్ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని నిర్మాత కోనేరు సత్యనారాయణ తెలిపారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, అనుపమ హీరోయిన్గా వచ్చిన సినిమా ‘రాక్షకుడు’కు దర్శకత్వం వహించిన రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. సత్యనారాయణ కోనేరు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామ’’న్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Raviteja