#BetheREALMAN : ఇళ్లు ఊడ్చిన చరణ్.. ఉపాసనకు ప్రేమగా కాఫీ..

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా స్టార్ట్ చేసిన ‘బీ ద రియల్‌ మెన్‌’ ఛాలెంజ్‌లో భాగంగా రాజమౌళి చరణ్‌ను నామినేట్ చేయగా ఆయన ఆ ఛాలెంజ్‌ను స్వీకరించమే కాకుండా విజయవంతంగా పూర్తిచేశాడు.

news18-telugu
Updated: April 21, 2020, 2:12 PM IST
#BetheREALMAN : ఇళ్లు ఊడ్చిన చరణ్.. ఉపాసనకు ప్రేమగా కాఫీ..
రామ్ చరణ్ ఉపాసన Photo : Twitter
  • Share this:
కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్ని రద్దైయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ఇంట్లో పనిమనుషులు రాక పోవడంతో ఇంట్లో ఆడవారికి సాయంగా ఉండాలనీ.. అంతేకాదు ఎవరైతే ఈ కష్టకాలంలో ఆడవారికి తోడుగా ఉంటారో వారే అసలైన మగవారని అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఓ వీడియోను షేర్ చేస్తూ రాజమౌళికి ఛాలెంజ్ విసిరాడు. దీంతో రాజమౌళి తన ఇల్లు శుభ్రం చేయడం.. ఇల్లు కడగడం లాంటీవి చేసి తారక్‌ను చరణ్‌ను నామినేట్ చేశాడు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా తారక్ ఇంటి పనులు చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేయగా తాజాగా చరణ్ కూడా చెట్లకు నీరు పోయడం, బట్టల్నీ వాషింగ్ మిషిన్‌లో వేయడమే కాకుండా తన సతీమణి ఉపాసనకు చక్కగా ఓ కాఫీ కలిపి ఇచ్చాడు. దీనికి సంబందించిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఈ సందర్భంగా ఆయన రణ్ వీర్ సింగ్, రానా దగ్గుబాటి, శర్వానంద్‌కు ఛాలెంజ్ విసిరాడు. అలా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా స్టార్ట్ చేసిన ‘బీ ద రియల్‌ మెన్‌’ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్‌తో పాటు మరో ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 70శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ పూణేలో జరగాల్సీఉంది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
Published by: Suresh Rachamalla
First published: April 21, 2020, 2:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading