నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) హీరోగా రాబోతున్న పవర్ ఫుల్ ఏక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి (Veera Simha Reddy). మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో బాలకృష్ణ 107వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది. ఎప్పుడైతే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారో అప్పటినుంచే నందమూరి ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తోడు ఈ మూవీ నుంచి వస్తున్న అప్ డేట్స్ ఇంకాస్త క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన 'జై బాలయ్య' సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సాంగ్ పై జరుగుతున్న ట్రోలింగ్ ఇష్యూపై లిరికిస్ట్ రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.
ఈ ‘జై బాలయ్య’ సాంగ్ ట్యూన్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చేసిన ‘ఒసేయ్ రాములమ్మా’ (Osey Ramulamma) పాట ట్యూన్‌ని పోలి ఉందంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రోలింగ్ నడుస్తోంది. తమన్ ని కాపీ క్యాట్ అంటూ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు కొందరు. ఈ క్రమంలో కొందరు ట్రోలర్స్ రామజోగయ్య శాస్త్రి గారి పేరు ముందు ఉన్న సరస్వతీపుత్ర అనే బిరుదును కూడా అవహేళన చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో జనాల్లో ఈ సాంగ్‌పై ఇష్యూ ముదిరింది.
ఇంతలో రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ లో పెట్టిన ఓ పోస్ట్ చర్చల్లోకి వచ్చింది. ''ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు. అన్నట్టు జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి'' అంటూ షాకింగ్ పోస్ట్ వదిలారు రామజోగయ్య శాస్త్రి.
అయ్యో..@abntelugutv ....నా ట్వీట్ వేరే విషయం మీద...ట్రోలింగ్ లేదు ఏమి లేదు...అందరు ఫాన్స్ నేనంటే చాలా ఇష్టపడతారు..ముఖ్యంగా ఈపాట పట్ల అందరూ సాహిత్యాన్ని చాలా మెచ్చుకుంటున్నారు..దయచేసి ఈ ఆర్టికిల్ లేపేయండి???? @subbaraon చూడండి ???? https://t.co/93cHNyAu2i
— RamajogaiahSastry (@ramjowrites) November 25, 2022
ఈ పోస్ట్ చూసి జై బాలయ్య సాంగ్ పై వస్తున్న ట్రోల్స్ తిప్పికొట్టేందుకే రామజోగయ్య శాస్త్రి ఈ ట్వీట్ చేశారని అంతా భావించారు. దీనిపై బోలెడన్ని వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఓ మీడియా రాసిన వార్తను ట్యాగ్ చేస్తూ మరోసారి వివరణతో కూడిన పోస్ట్ పెట్టారు రామజోగయ్య శాస్త్రి. ''అయ్యో.. నా ట్వీట్ వేరే విషయం మీద. ట్రోలింగ్ లేదు ఏమి లేదు. అందరు ఫాన్స్ నేనంటే చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ పాట పట్ల అందరూ సాహిత్యాన్ని చాలా మెచ్చుకుంటున్నారు. దయచేసి ఈ ఆర్టికిల్ లేపేయండి'' అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jai Balayya, Nandamuri balakrishna, NBK 107, Veera Simha Reddy