Home /News /movies /

RAMA RAO ON DUTY MOVIE REVIEW AND RATING IS RAVI TEJA GOT SUCCESS THIS MOVIE TA

Rama Rao On Duty Movie Review : రవి తేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

రవితేజ ‘రామారావు’ ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ  (Twitter/Photo)

రవితేజ ‘రామారావు’ ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ (Twitter/Photo)

Rama Rao On Duty Movie Review : రవి తేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్స్‌లో విడుదలైంది. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
రివ్యూ : రామారావు ఆన్ డ్యూటీ   (Rama Rao On Duty)
నటీనటులు : రవి తేజ, వేణు తొట్టెంపూడి, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, నాజర్, నరేష్, తనికెళ్ల భరణి, పవిత్ర లోకేష్ తదితరులు..
ఎడిటర్: ప్రవీణ్ కే.ఎల్.
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
సంగీతం: సామ్ సి.ఎస్.
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
సంగీతం:శరత్ మండవ
విడుదల తేది : 29/7/2022

మాస్ మహారాజ్ రవితేజ  ఈ యేడాది ఈ ఇయర్ ఖిలాడి’మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు. ఈ నేపథ్యంలో కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో చేసిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీతో  సినిమా అనగానే మాస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరి అంచనాలను రవితేజ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

రామారావు నీతి, నిజాయితీగల సబ్ కలెక్టర్. న్యాయం కోసం తన అధికార పరిధి దాటి పేదలకు వాళ్లకు దక్కాల్సిన న్యాయం కోసం ఎంత దూరమైన వెళ్లే మనస్తత్వం.  ఈ నేపథ్యంలో అతను  రాజకీయ నాయకులు సహా పై అధికారుల నుంచి ఎన్నో ఆరోపణలు ఫేస్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో రవితేజకు తన సొంతూరు చిత్తూరులోని హర్స్‌లీ హిల్స్‌కు ఎమ్మార్వోగా  బదిలీ అవుతాడు. అక్కడ నిజాయితీతో పనిచేస్తుంటాడు. అక్కడ ఇతనికి సీఐ మురళి (వేణు తొట్టెంపూడి)తో ఈగో క్లాషెస్ వస్తాయి. అటు తన వృత్తిలో భాగంగా తన మాజీ ప్రేయసి (రజిషా విజయన్) భర్త కనిపించకుండా పోతాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే పనుల్లో అతని లాగే ఎంత మంది కనిపించకుండా పోతారు. అసలు వీళ్ల ఎందుకు మాయ మాయ్యారు. దీని వెనక ఉన్న పెద్ద మాఫియా ఎవరు ? దాన్ని ఓ ప్రభుత్వ అధికారికిగా రామారావు ఎలా సాల్వ్ చేసాడనేదే ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నీషయన్స్ విషయానికొస్తే..

దర్శకుడు శరత్ మండవ గతంలో తమిళంలో ఓ సినిమా చేసాడు. ఇక ఈ సినిమాను నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్టు పలు ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు.  పైగా ఇతను సిమాటోగ్రఫర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో రామారావు ఆన్ డ్యూటీ కోసం ఎంచుకున్న కథ బాగుంది. కానీ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో తడబడ్డాడు. ఈ సినిమా కోసం పుష్ప సినిమా తరహాలో ఎర్ర చందనం మాఫియా కథను ఎంచుకున్నాడు. అది కూడా 90ల నాటి బ్యాక్ డ్రాప్ కథతో కావడం విశేషం. ఇంటర్వెల్ వరకు ఈ సినిమాను ఆసక్తికరంగా తీసుకొచ్చి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో రవితేజ ఎమ్మెర్వోగా ఇన్వెస్టిగేషన్ తరహా ఆసక్తి రేకిత్తించేలా చేయడంలో విఫలమయ్యాడు. ఫస్టాఫ్‌లో నిజాయితీ గల ఎమ్మార్వోగా చూపించాన.. అది చివరి వరకు కంటిన్యూ చేయలేకపోయాడు. ఇప్పటి వరకు రవితేజ చేయని క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ పాత్రను ఇందులో చేయించడం కొత్తగా ఉంది.

ముఖ్యంగా పుష్ప సినిమాలో హీరో పోలీసులకు ఎర్ర చందనం దొరకకూడదని దాన్ని నదిలో పారవేస్తాడు. అవి తేలుతూ వెళుతాయి. కానీ ఇందులో శరత్ మండవ మాత్రం ఎర్ర చందనం నీటిలో మునుగుతుందని చూపెట్టాడు. ఇందులో ఎవరు కరెక్ట్ అనేది తెలియాల్సింది. పైగా హ్యాంగ్‌ కాంగ్‌లో ఎర్ర చందనం మాఫియా విలన్ లాంటి పాత్రను చివర్లో చూపించినా పెద్దగా ఎఫెక్టివ్‌గా లేదు. ఒక కన్నింగ్ ఎస్పీ ఒక మాఫియా డాన్ చేతిలో చనిపోవడం లాజిక్ మిస్సైయినట్టు కనపడుతోంది. ఈ సినిమాను ఇన్‌స్పెక్టర్ పాత్రలో వేణు కాకుండా ఎవరినీ తీసుకున్నా పెద్దగా ఒరిగిదేం లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సామ్ సీ.ఎస్ సంగీతం ఆర్ఆర్ బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే.. 

రవితేజ తన  మార్క్ ఎమ్మార్వో పాత్రలో బాగానే నటించాడు. ఇటువంటి తరహా పాత్రలు మాస్ మహారాజ్‌కు కొత్త కాదు. ఒక వేణు తొట్టెంపూడికి ఈ చిత్రంలో పెద్దగా నటించే అవకాశమే రాలేదు. ఉన్నంతలో కొత్త నటించే ప్రయత్నం చేసాడు.  ఒక హీరోయిన్స్‌గా నటించిన రజిషా విజయన్ ఉన్నంతలో ఏదో కొద్దగా నటించింది. హీరో భార్య పాత్రలో ఎవరినో తీసుకోవాలి కాబట్టి దివ్యాంశ కౌశిక్ ఖాళీగా ఉందని తీసుకున్నట్టు కనబడింది. ఇంటర్వెల్ తర్వాత ఒక పాటలో డాన్సులు, లిప్‌లాక్ తప్ప పెద్ద నటించింది ఏమి లేదు. మిగతా పాత్రల్లో నటించిన నరేష్, పవిత్ర లోకేష్, నాజర్, రాహుల్ రవీంద్రన్ ఉన్నంతలో పర్వాలేదనిపించారు.

ప్లస్ పాయంట్స్ 

రవితేజ నటన

ఫస్ట్ ఆఫ్

సామ్ సీ.ఎస్. సంగీతం, ఆర్ఆర్

మైనస్ పాయింట్స్ 

ఫస్ట్ ఆఫ్‌లో హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్

స్క్రీన్ ప్లే

సెకండాఫ్

హీరోయిన్స్

చివరి మాట : ప్రేక్షకులకు కనెక్ట్ కానీ  రవితేజ యాక్షన్ డ్రామా..

రేటింగ్ : 2.5/5
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Rama Rao On Duty, Ravi Teja, Tollywood

తదుపరి వార్తలు