ఈ సంక్రాంతి సీజన్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోవిడ్ నేపథ్యంలో యాబై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ రన్ అవుతున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతి రేసులో నాలుగు సినిమాలు వచ్చాయి. అందులో ముందుగా క్రాక్ విడుదలైంది. ఇక మిగిలిన మూడు సినిమాల్లో భోగి పండుగ రోజు విజయ్ మాస్టర్ ఖరారైంది. సంక్రాంతికి రామ్ హీరోగా చేసిన రెడ్ విడుదలవుతుంది. ఆ మరుసటి రోజు.. అంటే జనవరి 15న బెల్లంకొండ హీరోగా చేసిన అల్లుడు అదుర్స్ విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు అల్లుడు అదుర్స్ సినిమా ఓ రోజు ముందుగా థియేటర్స్‌లోకి వస్తుంది. అంటే జనవరి 15న విడుదల కావాల్సిన సినిమా జనవరి 14న విడుదలవుతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించింది.
అలా ముందుకు రావడం వెనుక రీజన్.. మార్కెట్‌లో ఓరోజు ఆలస్యంగా రావడం వెనుక వచ్చే లాభం ఏమీ ఉండదు. అదీ కాకుండా రామ్‌లాంటి హీరో కోసం ఎందుకు వెనక్కి వెళ్లాలని బెల్లంకొండ సురేశ్ ఆలోచించి ఉంటాడు. ఇప్పుడు రామ్ రెడ్ వర్సెస్ బెల్లంకొండ శ్రీనివాస్ అల్లు అదుర్స్ అన్నట్లు తయారైంది. మరి ఈ రెండు సక్సెస్ అవుతాయా? లేక ప్రస్తుత పరిస్థితుల్లో రెండు సినిమాల్లో ఒకరే విజేతగా నిలుస్తారా? అనేది రెండు, మూడు రోజులు లాగితే తెలిసిపోతుంది.
రెడ్ సినిమా పక్కా సస్పెన్స్ థ్రిల్లర్. రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ. కాగా.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చేసిన అల్లుడు అదుర్స్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఇందులో సోనూసూద్ కూడా కీలక పాత్రలో నటించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bellamkonda Sreenivas, Hero ram, RED Movie, Sankranti 2021