రామ్ వచ్చేసాడు.. ఇస్మార్ట్ పార్టీ చేసుకున్న పూరీ జగన్నాథ్, ఛార్మి..

ఇస్మార్ట్ శంకర్ విడుదలకు వారం రోజుల ముందే అమెరికా వెళ్లిపోయాడు రామ్. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఈయన ఎక్కడా ప్రమోషన్స్‌లో కూడా కనిపించలేదు. మరోవైపు పూరీతో రామ్‌కు గొడవ జరిగిందని వార్తలు వినిపించాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 1, 2019, 11:14 AM IST
రామ్ వచ్చేసాడు.. ఇస్మార్ట్ పార్టీ చేసుకున్న పూరీ జగన్నాథ్, ఛార్మి..
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ (Source: Twitter)
  • Share this:
ఇస్మార్ట్ శంకర్ విడుదలకు వారం రోజుల ముందే అమెరికా వెళ్లిపోయాడు రామ్. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఈయన ఎక్కడా ప్రమోషన్స్‌లో కూడా కనిపించలేదు. మరోవైపు పూరీతో రామ్‌కు గొడవ జరిగిందని.. ఆయన పారితోషికం విషయంలో రచ్చ అవుతుందని వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ ఏం లేవని.. అన్నీ పుకార్లే అని తేలిపోయింది. రామ్ అమెరికా నుంచి రావడం.. వచ్చిన వెంటనే పార్టీ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. మామూలుగా కాదు.. ఛార్మి, పూరీ కలిసి రామ్‌ను తడిసి ముద్దయ్యేలా చేసారు.

మందు పార్టీతోనే చిందేసారు.. చించేసారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రామ్ కొత్త లుక్‌లో కనిపించి రప్ఫాడించాడు. చాలా రోజులుగా గడ్డంతో కనిపించిన రామ్.. ఇప్పుడు క్లీన్ షేవ్‌లోకి వచ్చేసాడు. ఈయన లుక్ చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. మరోవైపు పూరీ జగన్నాథ్ కూడా రామ్‌తో ఉన్న ర్యాపోను కొనసాగిస్తున్నాడు. కచ్చితంగా రామ్ హీరోగా మరో సినిమా చేస్తానంటున్నాడు పూరీ.
ఇస్మార్ట్ శంకర్ విజయం చూసిన తర్వాత స్టార్ హీరోలు డేట్స్ ఇస్తారేమో అనుకుంటే ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఇప్పుడు పూరీ మరోసారి రామ్ హీరోగా ఇంకో సినిమా చేయాలని చూస్తున్నాడు. అందుకే ఇస్మార్ట్ శంకర్ లాభాల్లో ఆయనకు కూడా వాటా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2 చేస్తానంటున్నాడు పూరీ జగన్నాథ్. అందుకే రామ్‌తో రిలేషన్స్ మెయింటేన్ చేస్తున్నారు పూరీ, ఛార్మి. మొత్తానికి వీళ్ళ పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది.

First published: August 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు