RAM RED MOVIE FIRST DAY COLLECTIONS ISMART HERO GOT GOOD OPENINGS TA
Ram Red Movie First Day Collections: రామ్ ‘రెడ్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. మొత్తంగా ఎంత వసూళ్లు అంటే..
రామ్ రెడ్ మూవీ పాట
Ram Red Movie First Day Collections: ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ రెడ్. ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టిందంటే..
Ram Red Movie First Day Collections: ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ రెడ్. ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా తమిళ హిట్ చిత్రం తడమ్ కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కించారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 14న ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.గతేడాది ఏప్రిల్ 9న సమ్మర్లో విడుదలకావాల్సిన ఈ సినిమా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడి దాదాపు పది నెలల తర్వాత థియేటర్స్‌లో విడుదలైంది. మధ్యలో ఈ సినిమాకు మంచి ఓటీటీ ఆఫర్స్ వచ్చినా.. అన్నింటినీ కాదని ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల చేసారు.
ఈ సినిమాలో హీరో రామ్ తన కెరీర్లో ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేసాడు. రామ్‌తో పాటు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో నివేదా థామస్, మాళవిక శర్మ, అమృత అయ్యర్లు నటించారు.ఇస్మార్ట్ శంకర్ లాంటీ సినిమా తర్వాత రామ్ నుండి ఈ సినిమా రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగాయి. అంతేకాదు ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఐతే.. మొదటి రోజు ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టింది అంటే.. ఈ సినిమా తొలి రోజు రూ. 8.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. రూ. 6.7 కోట్ల షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
This is not a Routine Sankranthi.
This is a Thrilling Sankranthi!!💥
AUDIENCE RATING 100/100! 💯 for USTAAD @ramsayz’s MASSive BLOCKBUSTER #REDTheFilm.
ఓ రకంగా సగం ఆక్యుపెన్షీలో తక్కువ థియేటర్స్‌లో సంక్రాంతి పోటీలో ఈ రేంజ్లో వసూళ్లను రాబట్టడం మంచి విషయమే అని చెప్పాలి. ఓ రకంగా హీరోగా రామ్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా నైజాంలో రూ. 2.04 కోట్లు.. రాయలసీమ (సీడెడ్) 1.10 కోట్లు.. మిగిలిన ఏపీలో 3.30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మొత్తంగా రూ. రూ. 6.7 కోట్లు షేర్ రాబట్టింది. రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా ఇదే ఒరవడి కొనసాగిస్తే.. రెడ్ సినిమా సేఫ్ జోన్లోకి వచ్చేసినట్టే.