‘ఇస్మార్ట్ శంకర్’ దసరా ఇనాం.. ఆన్‌లైన్‌లో వచ్చేది గా దినమే..

టాలీవుడ్‌లో 'ఇస్మార్ట్ శంకర్' సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్‌ల మోత మోగించింది. తాజాగా ఈ సినిమా దసరా రోజున ఆన్‌లైన్‌లో విడుదల కానుంది.

news18-telugu
Updated: October 4, 2019, 4:21 PM IST
‘ఇస్మార్ట్ శంకర్’ దసరా ఇనాం.. ఆన్‌లైన్‌లో వచ్చేది గా దినమే..
రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ Instagram/ram_pothineni
  • Share this:
టాలీవుడ్‌లో 'ఇస్మార్ట్ శంకర్' సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్‌ల మోత మోగించింది. సూపర్ డూపర్ సక్సెస్‌తో బాక్సాఫీస్‌‌ను షేక్ చేసింది. డబుల్ దిమాక్‌తో రామ్ పోతినేని యాక్టింగ్ ఇరగ దీశాడు. హైదరాబాదీ యాసలో చెప్పిన ఊర మాస్ డైలాగ్‌లకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక నభా నటేష్, నిధి అగర్వాల్ అందాల విందుకు థియేటర్లో పూనకంతో ఊగిపోయారు యూత్. దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మిలో కొత్త ఉత్సాహం నింపిన ఇస్మార్ట్ మూవీ.. త్వరలో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో పలకరించనుంది. ఈ సినిమాను దసరా కానుకగా జీ5కు చెందిన డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.

రామ్ కెరీర్‌లో కూడా తొలిసారి 40 కోట్ల షేర్‌కు చేరువగా వచ్చిన సినిమా ఇది. ఎన్టీఆర్‌తో చేసిన ‘టెంపర్’ తర్వాత సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్‌కు ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక రామ్ కూడా అంతే. చాలా ఏళ్ళ తర్వాత అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఇస్మార్ట్ శంకర్‌తో. మరి థియేటర్స్‌లో సందడి చేసిన ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఏ మేరకు హంగామా చేస్తదో సూడాలి.

First published: October 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు