టాలీవుడ్లో 'ఇస్మార్ట్ శంకర్' సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల మోత మోగించింది. సూపర్ డూపర్ సక్సెస్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. డబుల్ దిమాక్‌తో రామ్ పోతినేని యాక్టింగ్ ఇరగ దీశాడు. హైదరాబాదీ యాసలో చెప్పిన ఊర మాస్ డైలాగ్‌లకు అభిమానులు ఫిదా అయిన్రు. ఇక నభా నటేష్, నిధి అగర్వాల్ అందాల విందుకు థియేటర్లో పూనకంతో ఊగిపోయారు యూత్. దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మిలో కొత్త ఉత్సాహం నింపింది. ఈ యేడాది జూలై 19వ తారీఖు రిలీజైన ఈ సినిమా.. నేటితో 100 దినాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన వంద రోజుల పోస్టర్ విడుదల చేసింది.
ఇక ఇస్మార్ట్ శంకర్‌గా రచ్చ చేసిన రామ్..కిశోర్ తిరుమల దర్శకత్వంలో తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా నటించిన ‘తడమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.
మరోవైపు పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇంకోవైపు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ismart Shankar, Puri Jagannadh, Ram Pothineni, Telugu Cinema, Tollywood