రామ్‌కు అదృష్టం కలిసొచ్చేనా... అదే జరిగితే హిట్ గ్యారంటీ..

ఒకప్పుడు రామ్‌కు కొద్దిలో మిస్సయిన అదృష్టం మళ్లీ అతడిని వెతుక్కుంటూ వస్తుందా ? అనే టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

news18-telugu
Updated: November 29, 2019, 4:53 PM IST
రామ్‌కు అదృష్టం కలిసొచ్చేనా... అదే జరిగితే హిట్ గ్యారంటీ..
రామ్ పోతినేని.. వయసు 31
  • Share this:
చాలాకాలం హిట్స్ లేక విలవిల్లాడిపోయిన యంగ్ హీరో రామ్‌కు ఇస్మార్ట్ శంకర్‌తో రీఛార్జింగ్ సక్సెస్ అందించాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఇస్మార్ట్ శంకర్‌తో వచ్చిన హిట్‌ను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న రామ్... తన తదుపరి సినిమాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే రామ్‌తో సినిమా చేసేందుకు యంగ్ డైరెక్టర్ రెడీ అవుతున్నాడనే న్యూస్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాను తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి... ఆ తరువాత రామ్‌తో సినిమా చేయడానికి కమిటయ్యాడని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

మళ్లీ మహేశ్ బాబుతోనే అనిల్ రావిపూడి సినిమా చేస్తాడనే ప్రచారం జరిగినా... రామ్‌తోనే అతడి తదుపరి సినిమా ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. వీళ్లిద్దరి కలయికలో ఇంతకుముందే ఓ సినిమా రావాల్సి ఉంది. ‘రాజా ది గ్రేట్’ చిత్రాన్ని అనిల్ ముందు ప్లాన్ చేసింది రామ్‌తోనే. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్య పడలేదు. ఇప్పుడు అనిల్, రామ్ కలిసి పని చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మరి... మహేశ్ బాబుతో సినిమా తరువాత రామ్ వంటి యావరేజ్ ఇమేజ్ ఉన్న హీరోతో అనిల్ రావిపూడి సినిమా చేస్తాడా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.


First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>