అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఇస్మార్ట్ హీరో...

వరుస హిట్లతో మాంచి ఊపుమీదున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. బ్యాక్ టూ బ్యాక్ అదిరిపోయే  హిట్ సినిమాలు తీస్తూ.. తనదైన కామెడీ టైమింగ్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

news18-telugu
Updated: November 30, 2019, 12:03 PM IST
అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఇస్మార్ట్ హీరో...
Twitter
  • Share this:
వరుస హిట్లతో మాంచి ఊపుమీదున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. బ్యాక్ టూ బ్యాక్ అదిరిపోయే  హిట్ సినిమాలు తీస్తూ.. తనదైన కామెడీ టైమింగ్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అనిల్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఇస్మార్ట్ హీరో రామ్‌తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా రామ్‌తో ఓ చిత్రం తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ, పలు కారణాల వల్ల రామ్‌ అప్పుడు ఆ సినిమా చేయలేకపోయారు. దాంతో ఆ కథను రవితేజకు వినిపించి ‘రాజా ది గ్రేట్‌’ పేరుతో తెరకెక్కించారు. తాజాగా అనిల్‌.. రామ్‌ కోసం ఓ అదిరిపోయే కథను సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాల టాక్. మహేష్‌ బాబుతో  ‘సరిలేరు నీకెవ్వరు’ పూర్తవ్వగానే అనిల్‌ తన తదుపరి చిత్రం రామ్‌తో చేయనున్నారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే కథ చర్చలు జరుగుతున్నాయని, దర్శకుడు అనిల్‌ చెప్పిన కథ రామ్‌కు నచ్చడంతో ఓకే చెప్పే కూడా చెప్పాడని టాక్. అది అలా ఉంటే రామ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ లాంటి అదిరిపోయే బ్లాక్ బస్టర్ తర్వాత కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తడం అనే తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘రెడ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. 

View this post on Instagram
 

Aaaannndddd it Begins!!!! .....With allllll your love.. ❤️ #RED #REDTheFilm #RAPO18


A post shared by RAm POthineni (@ram_pothineni) on


అందాలతో మతిపోగుడుతోన్న నైనా గంగూలీ..
First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>