RAM POTHINENI TO WORK WITH BOYAPATI SRINU FOR HIS NEXT OFFICIALLY ANNOUNCED HERE ARE THE DETAILS SR
Ram Pothineni : బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని.. అధికారిక ప్రకటన..
Ram Pothineni to work with Boyapati Srinu Photo : Twitter
Ram Pothineni : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) రెడ్ సినిమా తర్వాత ప్రస్తుతం తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇక
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) రెడ్ సినిమా తర్వాత ప్రస్తుతం తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా ఇలా ఉండగానే రామ్ (Ram Pothineni) మరో సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో రూపోందనుంది. ఇక ఇతర టెక్నికల్ విషయాల గురించి తెలియాల్సి ఉంది. ఇక రామ్ నటిస్తున్న ప్రస్తుతం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను లింగుసామి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి( Krithi Shetty) హీరోయిన్గా చేస్తున్నారు. ఈ సినిమాకు వారియర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాను కూడా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఈ సినిమాలో రామ్ (Ram Pothineni) పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఆడియో హక్కులకు ఆదిత్య మ్యూజిక్ సంస్థ భారీ ధర చెల్లించి దక్కిచుకున్నట్లు సమాచారం. ఇక తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా హిందీ వెర్షన్ కి సంబంధించి ఓ భారీ డీల్ జరిగినట్లు టాక్. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్ల రూపాయలకి అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ఈ సినిమా పాటల్ని ఆదిత్య మ్యూజిక్ రూ.2.75కోట్లు వెచ్చించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రామ్ కి ఇది కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుంది. ఇక ఈ సినిమా దర్శకుడు లింగుసామి విషయానికి వస్తే.. ఆయన గతంలో రన్, పందేంకోడి, ఆవారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. లింగుసామి మాస్ చిత్రాలకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.